వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నుండి 12 వికెట్లు డౌన్ .. 13వ వికెట్ జగ్గా రెడ్డా ? పైలట్ రోహిత్ రెడ్డా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాంగ్రెస్ నుండి 12 వికెట్లు డౌన్ .. 13వ వికెట్ జగ్గా రెడ్డా ? పైలట్ రోహిత్ రెడ్డా ? || Oneindia

తెలంగాణా శానససభలో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదాను లేకుండా చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు . అందుకు 13 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి రావాల్సి ఉంటుంది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పట్టారని ప్రచారం జరిగింది. వారిలో ఇద్దరు గులాబీ తీర్ధం పుచ్చుకోటానికి రెడీ అయిపోయారు. ఇంకా ఒక్కరు ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.

కడుపు చెక్కలు చేసుకున్న గండ్ర..! కార్యకర్తల సమక్షంలో కుమిలి కుమిల ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!కడుపు చెక్కలు చేసుకున్న గండ్ర..! కార్యకర్తల సమక్షంలో కుమిలి కుమిల ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!

కాంగ్రెస్ లో 12 వికెట్లు డౌన్ .. 13 వ వికెట్ ఎవరో అన్న టెన్షన్

కాంగ్రెస్ లో 12 వికెట్లు డౌన్ .. 13 వ వికెట్ ఎవరో అన్న టెన్షన్

కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వరకు 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడ్డారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుండి 12 వికెట్లు పడిపోయాయి. భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటన చేశారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇంకా 13వ ఎమ్మెల్యే కోసం కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ 13వ ఎమ్మెల్యే ఎవరనేది కాంగ్రెస్ శ్రేణులకు టెన్షన్ తెప్పిస్తుంది.

పార్టీ ఫిరాయింపుపై తటస్థంగా ఉన్న జగ్గా రెడ్డి

పార్టీ ఫిరాయింపుపై తటస్థంగా ఉన్న జగ్గా రెడ్డి

ఒకపక్క పార్టీలో ఉన్న శాసన సభ్యులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ఫిరాయింపులను ఆపలేకపోతుంది. కేసీఆర్ వ్యూహం ముందు కాంగ్రెస్ చిత్తవుతోంది. గండ్ర వెంకట రమణారెడ్డి , పోడెం వీరయ్యలతో పాటు జగ్గా రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినా జగ్గారెడ్డి ఇంకా పార్టీ మార్పు విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. పార్టీ మార్పుపై స్పందిస్తూ కాలమే నిర్ణయిస్తుంది అని ప్రకటించారు జగ్గా రెడ్డి . ఇక జగ్గారెడ్డి పార్టీ మార్పుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండా స్తబ్దంగా ఉన్నారు.

 సీఎల్పీ విలీనానికి ఇంకా ఒక ఎమ్మెల్యే అవసరం ..

సీఎల్పీ విలీనానికి ఇంకా ఒక ఎమ్మెల్యే అవసరం ..

అయితే, జగ్గారెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం పార్టీ మార్చేందుకు గాలం వేస్తున్నట్టు సమాచారం . అదే సమయంలో తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డికి కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఫిరాయింపుకు ప్రోత్సహిస్తుంది . ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు . ఫిరాయింపుల చట్టాన్ని అధిగమించడానికి సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడానికి మరో ఎమ్మెల్యే అవసరం ఉంటుంది కాబట్టి ఆ 13వ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి అవుతారా లేక పైలట్ రోహిత్ రెడ్డి అవుతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

English summary
The TRS party has tied the knot on the Congress party without the status of opposition in the assembly. That is why the Congress party MLAs are trying to attract with the operation akarsh . Present Congress MLAs Gandra Venkata Ramana reddy and Podem Veeraiah ready to join in TRS, with this defective MLA's count went into 12 . one more needed for the congress legislature dissolve in the legislative assembly. TRS is trying to get the MLA's into their trap Jagga reddy and pilot Rohith reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X