తెలంగాణలో కొత్తగా 137 కరోనా కేసులు: ఆ ఏడు జిల్లాల్లో సున్నా, 3600కి తగ్గిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 31,054 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 137 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 137 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,74,318కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో ఒకరుమరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3979గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. కాగా, మరో 1233 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 173 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,66,682కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,657 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.86 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 03, జీహెచ్ఎంసీలో 48. జగిత్యాలలో 03, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 01, కరీంనగర్‌లో 11, ఖమ్మంలో 05, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 01, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 03, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 10, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 03, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 08, రాజన్న సిరిసిల్లలో 01, రంగారెడ్డిలో 16, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 02, సూర్యాపేటలో 04, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 04, వరంగల్ అర్బన్‌లో 03, యాదాద్రి భువనగిరిలో 01 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడు జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు, దేశంలో కరోనావైరస్ కేసుల్లో క్రమంగా తగ్గుదల నమోదవుతోంది.
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 11,106 కరోనా కేసులు వెలుగుచూశాయి. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు నమోదైన కొత్త కేసుల సంఖ్య 3.44 కోట్లు దాటింది. కాగా, కొత్త కేసుల్లో 6111 కేసులు ఒక్క కేరళ నుంచే కావడం గమనార్హం.
గత 24 గంటల వ్యవధిలో 12,789 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.38 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.28 శాతంగా ఉంది. గురువారం 459 మంది మరణించారు. ఇందులో ఒక్క కేరళ నుంచే 372 మరణాలు ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4,65,082కు చేరింది. పాజిటివిటీ రేటు 0.37 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 1,26,620 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. గురువారం 72.9 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 115 కోట్లు దాటింది.












Click it and Unblock the Notifications