వామ్మో.. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ సైబర్ మోసం..
సైబర్ నేరాలను ఆపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా ఈ మోసాలు ఆగడం లేదు. హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. హబ్సిగూడలో ఓ డెంటల్ డాక్టర్ దగ్గర రూ.14 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సైబర్ మోసంగా పోలీసులు భావిస్తున్నారు. నకిలీ పెట్టుబడుల పేరుతో ఆ వైద్యుడికి సైబర్ కేటుగాళ్లు భారీ మస్కా కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది.
సైబర్ నేరగాళ్ల చేతిలో అమాయకులు మాత్రమే కాదు.. డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సెలబ్రిటీలు ఇలా అందరూ మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హబ్సిగూడలో డెంటల్ డాక్టర్ దగ్గర రూ.14 కోట్లు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఈ మేరకు ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ఓ డెంటల్ డాక్టరుకు ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది. మోనికా మాధవన్ అనే పేరుతో ఓ మహిళ అతనికి మెసేజ్ పెట్టింది. పెళ్లి పేరుతో తాను మోసపోయానని.. కష్టాల్లో ఉన్నా నన్ను ఆదుకోండి అంటూ మెసేజ్ పెట్టింది. అలా మెల్లిగా టెలీగ్రామ్ ఐడీ ద్వారా సంప్రదింపులు జరుపుదామని తెలిపింది. ఆమె నిర్ణయానికి వైద్యుడు సమ్మతించడంతో వారిద్దరి మధ్య సంభాషణలు పెరిగాయి.

ఈ క్రమంలో తనకు షేర్ ట్రేడింగ్ లో బాగా అనుభవం ఉందని.. విదేశాల్లో ఉన్న స్టాక్ ఎక్స్ చేంజ్ లో పెట్టుబలు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ వైద్యుడిని నమ్మించింది. అలా తొలుత డాక్టర్ కు పెద్ద మొత్తంలో లాభాలు ఆశ చూపెట్టింది. ఇక ఆ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలని చెప్పి రూ. మూడున్నర కోట్లు కొట్టేసింది. అలా మొత్తం 91సార్లు రూ. 14 కోట్లకుపైగా కాజేసింది. దీంతో తాను మోసపోయానని భావించిన ఆ డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications