సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్: రిపోర్టులో సంచలన విషయాలు

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్​ సీసీఎస్​ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు బుధవారం చంచల్​‌గూడకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఏసీపీ నివాసంతోపాటు 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు.

ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ. 40 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్​ వస్తువులు, డైరీల్లో సందీప్​ అనే పేరును గుర్తించారు. ఇద్దరు కలిసి ఏమైనా ఆర్థిక లావాదేవీలు సాగించారా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

14 days remand for CCS ACP Umamaheswara Rao

హైదరాబాద్​ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఉమామహేశ్వరరావు అరెస్టు చేశారు. ఆ తర్వాత తాజాగా, బుధవారం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్​ విధించారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావును చంచల్‌​గూడ జైలుకు తరలించారు.

భారీగా ఆస్తులు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

మరోవైపు, రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.అశోక్​ నగర్‌​లో 205, 504 ఫ్లాట్స్‌లో సోదాలు నిర్వహించామని రిమాండ్ రిపోర్టులో, బర్కత్‌​పురాలో డీఎస్పీ సందీప్​ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిపారు. ఇక, కాప్రాలోని ఏసీపీ స్నేహితుడు నరేంద్ర బాబు నివాసంలోనూ దాడులు చేశారు. సికింద్రాబాద్‌​లో​ నీలిమా నివాసం, అనకాపల్లిలో బంధువు మహాలక్ష్మి, విశాఖపట్టణంలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో నగదు రూ.38 లక్షలు, బంగారం 60 తులాలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. షామీర్​ పేట్‌​లో రూ.80 లక్షలు విలువైన ఎకరం భూమి, 333 గజాల విల్లాను గుర్తించారు. జవహర్​ నగర్‌​లో 3 గుంటలు, ఘట్​‌కేసర్‌​లో 4 ప్లాట్లు, శామీర్​‌పేట్‌​లో 14 గుంటల బినామీ భూమి, అశోక్​ నగర్‌​లో ఉన్న అపార్టుమెంట్​లో 3 ఫ్లాట్లను, కూకట్​‌పల్లిలో 200 గజాల ఫ్లాట్‌​ను గుర్తించారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో 25 సెంట్ల భూమి, చోడవరంలో 5.92 ఎకరాలు, 240 గజాల ప్లాట్, దొండపూడిలో 2.20 ఎకరాల బినామా ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్​ఎస్​ కన్ట్రక్షన్లో విలా కొనుగోలు కోసం ఉమామహేశ్వరరావు రూ.50 లక్షల పెట్టుబడి పెట్టారు. ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+