కొత్తగా 14 జిల్లాలు: ఎందుకో చెప్పిన కేసీఆర్, హడావుడిగా రాజ్‌భవన్‌కు..!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త జిల్లాల పైన బుధవారం నాడు మాట్లాడారు. కొత్త జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కేసీఆర్‌దే ఫైనల్: కొత్తగా 14 లేదా 16 జిల్లాలు, జోనల్ వ్యవస్థపై తర్జన
కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో జిల్లాలో జనాభా సగటు 18 లక్షలుగా ఉందని, తెలంగాణలో మాత్రం 36 లక్షలుగా ఉంది చెప్పారు. అధిక జనాభా కారణంగానే జిల్లాల విభజన చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా 14 జిల్లాలు, 73 లేదా 74 మండలాలు ఉంటాయని చెప్పారు.

జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న మండలాలను అదే జిల్లాలో కలిపేస్తామని చెప్పారు. ఒకే నియోజకవర్గం ఒకే జిల్లా కింద ఉండాలనే నిబంధన లేదని చెప్పారు. రెండు లేదా మూడు జిల్లాలకు కూడా విస్తరించవచ్చునని కేసీఆర్ చెప్పారు.
కొత్త జిల్లాలపై కొత్త ట్విస్ట్: కేసీఆర్ అనుకున్నదొకటి.. చెప్పిందొకటి!
దసరా నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు బృందాలుగా ఏర్పడి అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు జిల్లాల పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ తగిన రీతిలో అభివృద్ధి చెందాలన్నారు.
రాజ్‌నాథ్ నుంచి ఫోన్..!
బుధవారం టిఆర్ఎస్ఎల్పీ సమావేశం నుంచి కేసీఆర్ హుటాహుటిన రాజ్ భవన్ వెళ్లారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి కేసీఆర్‌కు ఫోన్ వచ్చింది. దీంతో హడావుడిగా వెళ్లారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications