తెలంగాణలో 144 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, ఆరు జిల్లాల్లో సున్నా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 35,659 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 144 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 144 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,74,181కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో ఒకరుమరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3978గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. కాగా, మరో 1178 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

144 new corona cases, 01 deaths reported in telangana state, in last 24 hours

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 161 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,66,509కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,694 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.86 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 05, జీహెచ్ఎంసీలో 54. జగిత్యాలలో 04, జనగామలో 01, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 07, ఖమ్మంలో 08, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 01, మహబూబాబాద్‌లో 01, మంచిర్యాలలో 05, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 09, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 05, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 00, పెద్దపల్లిలో 02, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 12, సంగారెడ్డిలో 00, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 03, వికారాబాద్ లో 01, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 09, యాదాద్రి భువనగిరిలో 01 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు, దేశంలో కరోనావైరస్ కేసుల్లో క్రమంగా తగ్గుదల నమోదవుతోంది. అయితే, గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 11,919 కరోనా కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు రోజు 10,197 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు నమోదైన కొత్త కేసుల సంఖ్య 3,44,78,517కు చేరింది. కాగా, కొత్త కేసుల్లో 6849 కేసులు ఒక్క కేరళ నుంచే కావడం గమనార్హం. గత 24 గంటల వ్యవధిలో 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,38,85,132కి చేరింది. బుధవారం 470 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4,64,623కు చేరింది. పాజిటివిటీ రేటు 0.37 శాతానికి తగ్గింది. ఇది మార్చి 2020 తర్వాత అత్యంత కనిష్టం కావడం గమనార్హం. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బుధవారం 73,44,739 మంది టీకాలు తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 114కోట్లు దాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+