తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, జిల్లాలవారీగా కొత్త కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది వారాలుగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అయితే, అంతకుముందు రోజుతో పోల్చుతే గురువారం కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో 1.19,464 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 1492 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను గురువారం సాయంత్రం రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 1492 కరోనా కేసులు, 13 మరణాలు

తెలంగాణలో కొత్తగా 1492 కరోనా కేసులు, 13 మరణాలు

తాజాగా, నమోదైన 1492 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,09,417కు చేరింది. కరోనాతో కొత్తగా 13 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3534కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.

తెలంగాణలో 19,521 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 19,521 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1933 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,86,362కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 96.21 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నాటి నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. అయితే, వచ్చే వారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయడం లేదా? మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 91, జీహెచ్ఎంసీలో 166. జగిత్యాలలో 26, జనగామలో 14, జయశంకర్ భూపాలపల్లిలో 25, జోగులాంబ గద్వాలలో 15, కామారెడ్డిలో 06, కరీంనగర్‌లో 92, ఖమ్మంలో 129, కొమురంభీం ఆసిఫాబాద్‌లో 01, మహబూబ్‌నగర్‌లో 29, మహబూబాబాద్‌లో 67, మంచిర్యాలలో 49, మెదక్‌లో 13, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 83, ములుగులో 31, నాగర్ కర్నూలులో 16, నల్గొండలో 115, నారాయణపేటలో 09, నిర్మల్‌లో 07, నిజామాబాద్‌లో 08, పెద్దపల్లిలో 59, రాజన్న సిరిసిల్లలో 28, రంగారెడ్డిలో 92, సంగారెడ్డిలో 18, సిద్దిపేటలో 53, సూర్యాపేటలో 89, వికారాబాద్‌లో 19, వనపర్తిలో 27, వరంగల్ రూరల్‌లో 20, వరంగల్ అర్బన్‌లో 65, యాదాద్రి భువనగిరిలో 27 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+