15 సెకండ్లు కాదు.. గంట తీసుకోండి: నవనీత్‌కు అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోక్‌స‌భ‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా ఒకప్పటి టాలీవుడ్ నటి నవనీత్ రవి రాణా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీగా ఉన్న నవనీత్.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నగరం‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువ మోర్చా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

15 seconds Vs 1 hour Asaduddin Owaisi counter to Navnit Ravi Rana comments

15 నిమిషాలు పోలీసులు లేకుండా ఉంటే మా తడాఖా ఏమిటో చూపిస్తామని గతంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 'మాకు 15 సెకన్లు చాలు' అంటూ నవనీత్ కౌంటర్ ఇచ్చారు. 'పోలీసులను 15 నిమిషాలు తప్పుకోమనండి, మేము ఏమి చేయగలమో చూపిస్తామని అసదుద్దీన్ తమ్ముడు చెప్పాడు. మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ మాకు 15 సెకన్లే చాలని నేను అతడితో చెప్పాలనుకుంటున్నా. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే పాకిస్థాన్‌కు వేసినట్టే' అని నవనీత్ రవి రాణా వ్యాఖ్యానించారు.

అంతేగాక, 39 సెకన్ల ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి అక్బరుద్దీన్ ఒవైసీకి కు ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో నవనీత్ రవి రాణా వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 'మీరు చెప్పినట్టే కానీయండి' అంటూ సవాల్ విసిరారు.

'నేను ప్రధాని మోడీజీకి చెబుతున్నాను. ఆమెకు 15 సెకన్లు ఇవ్వండి. ఆమె ఏమి చేస్తుందో చేయనీయండి. అవసరమైతే ఆమెకు ఒక గంట సమయం ఇవ్వండి. వారు ఏమి చేస్తారో మేము చూడాలనుకుంటున్నాం. వారిలో మానవత్వం మిగిలి ఉందా? ఎవరు భయపడతారు? మేం సిద్ధంగా ఉన్నాం.. ఎవరైనా ఓపెన్ కాల్ చేస్తే (ఇలా) అలాగే ఉంటాం. మీరు అనుకున్నది చేయండి. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మిమ్మల్ని ఆపేదెవరు?' అని మీడియాతో ఒవైసీ అన్నారు. మరోవైపు, ప్రధాని మోడీపైనా విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+