తెలంగాణలో 40వేల చేరువలో కరోనా పాజిటివ్ కేసులు: 11 మరణాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా, బుధవారం 1597 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 39,342కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 12,958 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 1159 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 25,999కు చేరింది. ఇక బుధవారం మరో 11 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 386కు చేరింది.

1597 new corona positive cases recorded in telangana: 11 deaths.

తెలంగాణలో బుధవారం 13,642 కరోనా టెస్టులు నిర్వహించగా.. 1597 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 2,08,666కు చేరింది. బుధవారం 12,045 ఫలితాలు నెగిటివ్‌గా తేలాయి.

బుధవారం నమోదైన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు.
ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 796 కొత్త కేసులు నమోదు కావడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Bubonic Plague : అమెరికాలో ఉడుతకు Bubonic Plague పాజిటివ్‌! || Oneindia Telugu

    మేడ్చల్ జిల్లాలో 115, సంగారెడ్డి 73, ఖమ్మం 6, కామారెడ్డి 30, వరంగల్ అర్బన్ 44, కరీంనగర్ 41, యాదాద్రి భువనగిరి 13, మహబూబాబాద్ 5, పెద్దపల్లి 20, మెదక్ 18, మహబూబ్‌నగర్ 21, మంచిర్యాల 26, భద్రాద్రి కొత్తగూడెం 7, జయశంకర్ భూపాలపల్లి 15, నల్గొండ 58, రాజన్న సిరిసిల్ల 6, ఆదిలాబాద్ 1, నారాయణపేట్ 5, వికారాబాద్ 5, నాగర్ కర్నూల్ 5, జనగామ 8, నిజామాబాద్ 13, ములుగు 4, వనపర్తి 5, సిద్దిపేట 27, సూర్యపేట 14, గద్వాల్ 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+