నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

18 నెలల చిన్నారి.. టాటా చెబుదామని వచ్చి.. పాఠశాల బస్సు చక్రం కింద పడి...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: 18 నెలలకే ఓ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. బడికెళ్లే పిల్లలకు టాటా చెబుదామని వచ్చి పాఠశాల బస్సు చక్రం కింద చితికిపోయాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి నిండు ప్రాణం బలైపోయింది.

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం సాటాపూర్‌కు చెందిన మన్మథస్వామి, శివపూజ దంపతుల కుమారుడు శివనారాయణస్వామి(18నెలలు) ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి మృతి చెందాడు.

18-months-old boy killed in crash involving School bus

పాఠశాలకు చెందిన మినీ బస్సు విద్యార్థులను తీసుకెళ్లడానికి రాగా మన్మథస్వామి సోదరి మమత పిల్లలు మనోజ్‌, అమ్ములు స్కూల్‌ బస్సు ఎక్కుతుండగా శివనారాయణస్వామి వారికి టాటా చె ప్పేందుకు బస్సు వద్దకు వచ్చా డు.

డ్రైవర్‌కు కుడివైపు వెనుక చక్రం వద్ద నిలబడి ఆ బాలుడు టాటా చెప్తుండగా డ్రైవర్‌ చూసుకోలేదు. దీంతో బస్సు ఢీకొని శివనారాయణ స్వామి కిందపడిపోయాడు. బస్సు వెనక టైరు అతడి తలపై పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో చుట్టుపక్కల వారంతా ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యారు. కళ్ల ముందే కుమారుడిని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదన కలిచివేసింది. బడికెళ్లే పిల్లలకు టాటా చెప్పడానికి కొచ్చిన 18 నెలల చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చూపరులను కదిలించి వేసింది.

English summary
18-months-old boy died in a school bus accident in Satapur of Renjal Mandal, Nizamabad District. While the school going children stepping into the bus, Sivanarayana Swamy, 18-months old boy came to the bus to say TATA. Due to the neglegence of the bus driver this incident the boy was dead on the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X