తెలంగాణలో కొత్తగా 190 కరోనా కేసులు: భారీగా తగ్గిన రికవరీ, పెరిగిన యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఒక్కోసారి కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 41,388 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 190 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 190 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,70,643కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3950గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1114 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

190 new corona cases, 1 death reported in telangana state, in last 24 hours

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,62,592కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,101 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 07, జీహెచ్ఎంసీలో 68. జగిత్యాలలో 06, జనగామలో 03, జయశంకర్ భూపాలపల్లిలో 02, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 07, ఖమ్మంలో 04, కొమురంభీం ఆసిఫాబాద్ లో 03, మహబూబ్‌నగర్‌లో 04, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 03, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 14, ములుగులో 01, నాగర్ కర్నూలులో 02, నల్గొండలో 08, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 01, పెద్దపల్లిలో 05, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 05, వికారాబాద్ లో 00, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 04, వరంగల్ అర్బన్‌లో 06, యాదాద్రి భువనగిరిలో 04 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవదిలో 11,31,826 మంది నమూనాలను పరీక్షించగా.. 12,428 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.42 కోట్లకు చేరింది. సోమవారం 15,951 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.35 కోట్లను దాటింది. రికవరీ రేటు 98.19 శాతానికి పెరిగింది. పాజిటివిటీ రేటు 0.48 శాతానికి పడిపోయింది. దేశంలో ప్రస్తుతం 1.63 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌లో అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో కరోనా అదుపులోకి వచ్చింది. మహారాష్ట్రంలో కొత్తగా 889 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో సోమవారం 6వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం 64,75,733 మందికి టీకా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 102.94 కోట్లు దాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+