ఏ జిల్లాలో పోలింగ్ ఎంత - పల్స్ పై క్లారిటీ, 4 గంటలే కీలకం..!!
తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. క్రమేణా పోలింగ్ శాతం పెరుగుతోంది. ఎన్నికల సంఘం తాజా సమాచారం మేరకు 65 లక్షల మంది ఓటర్లు ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా పోలింగ్ లెక్కలను వెల్లడించారు. దీంతో, ఇప్పుడు పార్టీల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. పోలింగ్ శాతం..ఓటింగ్ సరళి పైన పార్టీలు ఫోకస్ చేసాయి. దీంతో..ఇప్పుడు మిగిలిన నాలుగ గంటల పోలింగ్ పైన పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.
పోలింగ్ శాతాలు ఇలా : తెలంగాణలో 20.64 శాతం పోలింగ్ నమొదలైంది. హైదరాబాద్ లో అత్యల్పంగా 12.39 శాతం నమోదు కాగా...అదిలాబాద్ లో 30.06 శాతం నమోదు అయినట్లు వెల్లడించారు. అదిలాబాద్30.6%, భద్రాద్రి22.05%,
హనుమకొండ21.43%, హైద్రాబాద్ 12.39%, జగిత్యాల22.5%, జనగాం 23.25%, భూపాలపల్లి27.80%, గద్వాల్ 29.54%, కామరెడ్డి24.70%, , కరీంనగర్20.09%, ఖమ్మం26.03%, ఆసిఫాబాద్23.68%, మహబూబాబాద్28.05%
మహబూబ్నగర్23.10%, మంచిర్యాల24.38%, మెదక్30.27%, మేడ్చల్14.74%, ములుగు25.36%, నగర కర్నూల్22.19%, నల్గొండ22.74% లో పోలింగ్ నమోదైంది.

ఎవరికి కలిసొచ్చేను : ఇక, నారాయణపేట23.11%, నిర్మల్25.10%, నిజామాబాద్21.25%, పెద్దపల్లి26.41%, సిరిసిల్ల22.02%, రంగారెడ్డి16.84%, సంగారెడ్డి21.99, సిద్దిపేట28.08%, సూర్యాపేట22.58%, వికారాబాద్23.16%, వనపర్తి24.10%
వరంగల్18.73%, యాదాద్రి24.29% పోలింగ్ శాతం నమోదైంది. హోరా హోరీగా మారిన ఎన్నికల సమరంలో పోలింగ్ సరళి ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికి అప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నాయి. తమకే అనుకూలంగా ఉందని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా..ఓటర్ల నాడి ఎంటనేది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో, చివరి నాలుగు గంటలు తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
సరళిపై క్లారిటీ : సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గతం కంటే పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక, క్షేత్ర స్థాయిలో పోలింగ్ సరళి అందరూ భావిస్తున్నట్లుగా హోరా హోరీగా లేదని..ఒక పార్టీకే క్లియర్ మెజార్టీ దిశగా ఉందనే నివేదికలు పార్టీలకు చేరుతున్నాయి. అటు పార్టీల నేతలు చివరి నిమిషం వరకు పూర్తిగా పోల్ మేనేజ్ మెంట్ పైనే ఫోకస్ చేస్తున్నాయి. ఈ సాయంత్రానికి పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాస్తవ ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications