ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి: నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఖమ్మం: ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటో ప్రత్యేక ఫోక్సో(ఫాస్ట్రాక్) కోర్టు న్యాయమూర్తి డానీరుత్ బుధవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామానికి చెందిన గరేళ్లి కొండయ్య 2018లో మేస్త్రీ పని కోసం మధిర మండలంలోని ఓ గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో మధిర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సదరు కేసును విచారించిన న్యాయమూర్తి.. నిందితుడిపై నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.












Click it and Unblock the Notifications