తెలంగాణలో కొత్తగా 201 కొత్త కరోనా కేసులు: ఆరు జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్, 4500కు యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 41,690 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 201 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,66,384కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3920గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1408 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

201 new corona cases, 1 death reported in telangana state, in last 24 hours.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,57,923కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4541 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 01, భద్రాద్రి కొత్తగూడెంలో 06, జీహెచ్ఎంసీలో 68. జగిత్యాలలో 06, జనగామలో 05, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 23, ఖమ్మంలో 03, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 01, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 09, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 05, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 12, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 06, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 06, వికారాబాద్ లో 01, వనపర్తిలో 02, వరంగల్ రూరల్‌లో 05, వరంగల్ అర్బన్‌లో 10, యాదాద్రి భువనగిరిలో 02 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాల్ పల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ములుగు, నారాయణ్ పేట్, నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 14,29 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 24,354 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. నిన్నటితో పోల్చితే ఇది 8.8 శాతం(26,727) తక్కువగా కావడం గమనార్మం. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3.38 కోట్ల చేరింది. శుక్రవారం 234 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,48,573కి చేరింది. శుక్రవారం 25,455 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.30కోట్లకుపై పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,73,889 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.81 శాతానికి తగ్గింది. శుక్రవారంనాడు 69.33 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 89.74 కోట్లకు చేరింది. మరోవైపు కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం కేరళలో దేశంలో సగానికిపైగా అంటే 13,834 కొత్త కేసులు నమోదు కాగా, 95 మరణాలు సంభవించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+