Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడు కేసులో అనూహ్య మలుపు- హైకోర్టులో

2013 Dilsukhnagar bomb case: దేశం మొత్తాన్నీ వణికించిన దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటన.. కీలక మలుపు తిరిగింది. దీనిపై తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దోషులకు మరణశిక్ష విధించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తుది ఆదేశాలు ఇచ్చింది.

ఈ కేసులో అయిదుమంది దోషులకు 2016 డిసెంబర్ 13వ తేదీన మరణశిక్ష విధించింది.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం. శిక్ష పడిన వారిలో అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డి, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వాఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహ్మద్ తహ్సీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారుఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

2013 Dilsukhnagar bomb Telangana HC upheld the verdict by the NIA court sentencing to death

ప్రధాన సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ మరణ శిక్షను సవాల్ చేస్తూ వాళ్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ అప్పీల్ చేసుకున్నారు.

దీన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఇందులో ఎన్ఐఏ అధికారులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ అప్పీళ్లపై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ సుధతో కూడిన డివిజన్ బెంచ్ 45 రోజుల పాటు విస్తృతంగా విచారణ చేపట్టింది. నేటికి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తన తీర్పును వినిపించిందీ బెంచ్. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణ శిక్షను సమర్థించింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన ముజాహిదీన్ వ్యవస్థాపకుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అతను పాకిస్తాన్‌లో నివసిస్తోన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. కరాచీలో నివస్తోన్నట్లు ఇదివరకే వెల్లడించింది.

2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్ నగర్‌లో సంభవించిన ఈ జంట పేలుళ్ల ఘటన యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో 18 మందికి పైగా మరణించారు. 131 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇఫ్పటికీ చాలామంది కోలుకోవట్లేదు. కొందరు శాశ్వతంగా వికలాంగులయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+