తెలంగాణలో కరోనా ఉద్ధృతి.. 2వేలకుపైగా కొత్త కేసులు.. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న హరీశ్
తెలంగాణలో కరోనా విలయతాండం చేస్తోంది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు వైరస్ బాధితుల సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు మంత్రి హరీశ్. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులు పాలు కావద్దని సూచించారు.

ఒక్కరోజులో 2,295 కరోనా కేసులు
తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 24 గంటలల్లో 64,474 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిలో 2,295 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6, 89,751కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా గత 24 గంటల్లో ముగ్గురు మృతిచెందారు. దీంతో మరణించినవారి సంఖ్య 4,039కి చేరింది. కరోనా బారిన పడినవారు నిన్న 278 మంది కోలున్నారని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

హైదరాబాద్‌లో 1,452 మందికి పాజిటివ్
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులో నమోదైన మొత్తం 2,295 కరోనా కేసుల్లో 1,452 మంది బాధితులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కసారిగా ఇన్ని కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ంలో గురువారం నమోదైన 1, 913 కేసులతో పోల్చితే శుక్రవారం దాదాపు 400 పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చాయి. ఒక్కసారిగా ఇన్ని కేసులు పెరడానికి కిస్మస్, న్యూయర్ వేడుకలు కారణమై ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

థర్డ్ వేవ్‌ను ఎదుర్కోనేందుకు సిద్ధం
మరోవైపు కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కోనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. జనవరి 10 నుంచి 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రైవేటు హాస్పిటల్స్ కి వెల్లి అప్పులు పాలు కావద్దు
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కోటి హోం ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్లకుపై కరోనా నిర్థారణ కిట్లను సిద్దం చేసినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. వీటన్నింటినీ అన్ని జిల్లాల పీహెచ్‌సీ, సబ్ సెంటర్‌లకు సరఫరా చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురి చెందాల్సిన అవరసరం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్స్ కి వెల్లి అప్పులు పాలు కావద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని హరీశ్ తెలిపారు.












Click it and Unblock the Notifications