హైదరాబాద్ కేంద్రంగా భారీగా హవాలా సొమ్ము.. 3.5 కోట్లు సీజ్; ఆరుగురు అరెస్ట్!!
హైదరాబాద్ లోని గాంధీ నగర్ లో భారీగా హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 3.5 కోట్ల రూపాయల నగదును రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న క్రమంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదును తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

మారియట్ హోటల్ నుండి 3.5 కోట్ల హవాలా డబ్బు తరలింపు యత్నం
మారియట్ హోటల్ కేంద్రంగా భారీగా హవాలా నగదు తరలిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మరియు గాంధీనగర్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మారియట్ హోటల్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించగా, రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల లెక్కల్లో చూపని నగదు పట్టుబడింది. కర్మన్ ఘాట్ న్యూ బాలాజీ నగర్ కు చెందిన గంటా సాయి కుమార్ రెడ్డికి, కె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 3.5 కోట్ల నగదు ఇచ్చి సైదాబాద్ లో ఉండే బాలు మహేందర్ కు అందజేయాలని సూచించాడు.

పట్టుకున్న టాస్క్ ఫోర్స్ .. ఆరుగురు అరెస్ట్
దీంతో సాయి కుమార్ రెడ్డి తన స్నేహితులైన మహేష్, సందీప్ కుమార్, మహేందర్, అనుష్ రెడ్డి, భరత్ తో కలిసి రెండు కార్లలో నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ సొమ్ముకు సరైన ఆధారాలు చూపించక పోవడంతో పోలీసులు హవాలా కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతున్న తీరు కలకలం గా మారింది .

గతంలోనూ భారీగా పట్టుబడిన హవాలా నగదు.. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘా
గతంలో కూడా 2.49 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో 2.49 కోట్ల హవాలా డబ్బును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను బెంగళూరుకు చెందిన బోయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న సిబ్బంది గా గుర్తించారు. అంతకుముందు చాంద్రాయణగుట్ట పోలీసులు కూడా 79 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. వరుస ఉదంతాలతో హైదరాబాద్ లో హవాలా సొమ్ము పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications