వీడ్కోలు పలికేందుకు వెళ్తూ... తిరిగిరాని లోకాలకు
హైదరాబాద్: బంధువులు దుబాయ్‌కి వెళ్తుంటే వారికి వీడ్కోలు పలికేందుకు కారులో వెళ్తూ... ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపర్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రామకృష్ణాపురానికి చెందిన రాజనర్సు, నవీన్, నరేష్ అనే ముగ్గురు వ్యక్తులు మరో ముగ్గురితో కలిసి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి కారులో బయలుదేరారు.

సోమవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్ధలికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications