వావ్.. కోవిడ్ కేర్ సెంటర్‌గా చర్చ్.. 300 పడకలతో... ఇక్కడే

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రభుత్వ దవాఖానాల్లో బెడ్ల కొరత ఉంది. ఆక్సిజన్ కూడా సరిపడటం లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అయితే కరోనా వేళ కొందరు తమ ఉదారత చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ చర్చ్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌గా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చుద్దాం పదండి.

దేశంలో కరోనా కోరలు చాచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మనసున్న మారాజులు, కొన్ని కంపెనీలు సాయం చేస్తున్నారు. తెలంగాణలో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ హఫీస్ పేటలో కలవరీ టెంపుల్ చర్చ్ ఉంది. ఇదీ చాలా ఫేమస్ కూడా.. అయితే చర్చ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కలవరీ టెంపుల్‌ను కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు అంగీకారం తెలిపారు. దాదాపు 300 బెడ్లతో కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చివేశారు. దీనిని శనివారం రోజున ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. కరోనా వల్ల దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని కలవరీ టెంపుల్ ఫౌండర్, పాస్టర్ పీ సతీష్ కుమార్ ఉన్నారు. ఈ కఠిన సమయంలో కులం, మతాలకు అతీతంగా సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఒక్కరు ఇలా సాయం చేయాలని కోరారు.

ఇదెక్కటే కాదు తెలంగాణ, ఏపీలో గల కలవరీ టెంపుల్స్‌ను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చుతామని సతీష్ కుమార్ తెలిపారు. కానీ ఇదీ చాలా మంచి విషయం అని అందరూ అంటున్నారు. గొప్ప నిర్ణయం అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయా సెంటర్లు సాయం చేస్తాయని వివరించారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే ఆక్సిజన్ కూడా సరఫరా చేస్తామని వివరించారు.

300-bed COVID isolation centre set up at Hyderabad church

తాము ఏడు ఆస్పత్రులతో టై అప్ అయ్యామని చెప్పారు. అంబులెన్స్ సేవ కూడా అందజేస్తామని చెప్పారు. హఫీజ్ పేటలో 300 బెడ్లు అందుబాటులో ఉన్నాయని.. అవసరం అనుకుంటే మరో 700 వరకు పెంచుతామని చెప్పారు. మొత్త 1000 పడకలతో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+