Jubilee hills: పోలింగ్ వేళ ఊహించని ట్విస్ట్, వాట్ నెక్స్ట్..!!
Jubilee hills voting: జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు ఆశలు పెంచుకున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్దులు బరిలో నిలిచారు. నియోజకవర్గ పరిధిలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కాగా, పోలింగ్ వేళ ఓటర్ల నిర్ణయం మాత్రం అభ్యర్దులకు షాక్ గా మారుతోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వేళ పోటీలో ఉన్న అభ్యర్దులకు కొత్త టెన్షన్ మొదలైంది. పోలింగ్ పైన పార్టీల అభ్యర్దులు ఆశలు పెట్టుకున్నారు. ఏ మేర పోలింగ్ జరిగితే ఎవరికి కలిసి వస్తుందనే అంచనాలతో ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ప్రధాన పార్టీలకు అంతు చిక్కటం లేదు. సాయంత్రం 6 వరకు కొనసాగనున్న పోలింగ్ కొనసాగనుంది.

భారీగా పోలింగ్ నమోదు అయ్యేందుకు ఎన్నిక సంఘం తో పాటుగా పార్టీల అభ్యర్దులు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతండగా.. బస్తీల్లో మాత్రమే ఎన్నిక సందడి ఎంతో కొంత కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు పెద్దగా ఓటింగ్ కు ఆసక్తి చూపటం లేదు. సాయంత్రం వరకు పోలింగ్ కు సమయం ఉండటంతో.. ముగిసే వేళ ఓటర్ల సంఖ్య పెరుగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.
బస్తీలతో పాటుగా ప్రధాన వార్డుల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం స్వల్పంగా ఉంది. కొన్ని కేంద్రాల్లో కనీస ఓటింగ్ జరగలేదని క్షేత్ర స్థాయి సమాచారం. అటు మూడు ప్రధాన పార్టీలు వార్ రూమ్స్ ద్వారా పోలింగ్ సరళిని సమీక్షిస్తున్నారు. చివరి నిమిషం వరకు అన్ని వ్యూహాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం.. పోలీసు అధికారులు పోలింగ్ తీరు ను నిశితంగా గమనిస్తున్నారు. స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అదే సమయంలో రిటర్నింగ్ అధికారికి ఇప్పటివరకు బీఆర్ఎస్ 60 ఫిర్యాదులు చేసింది.
కాంగ్రెస్ శ్రేణులు డబ్బులు పంచుతున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. పోలింగ్ 60 శాతం దాటుతుంది అనే అంచనాలు అభ్యర్దులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఇదే పోలింగ్ సరళి కొనసాగితే ఫలితం ఎలా ఉంటుందనే లెక్కలు మొదలయ్యాయి. దీంతో.. ఓటర్లు పెడుతున్న పరీక్షతో అభ్యర్దుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సాయంత్రం పోలింగ్ పూర్తయ్యాక.. ఫలితం పైన ఒక అంచనా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications