లెక్క మారుతోంది, డేంజర్ బెల్స్ - లేటెస్ట్ పోల్ రిపోర్ట్స్..!!
తెలంగాణ లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొద్ది గంటల్లో పోలింగ్ ముగియనుంది. ఈ ఉదయం నుంచి మధ్నాహ్నం 1 గంట వరకు 37 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పెరుగుతోంది. ఉదయం నుంచి సాగుతున్న పోలింగ్ సరళితో పార్టీలకు ఇప్పటికే ఫలితం ఏంటనేది దాదాపు అంచనాకు వచ్చేసాయి. తుది ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ తరహా ఓటింగ్ శాతం ఎవరికి కలిసి వస్తుంది. ఎవరికి డేంజర్ బెల్స్ గా మారనున్నాయి.
37 శాతం పోలింగ్: తెలంగాణలో 37 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అత్యధికంగా మెదక్ 50.80 శాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో 20.79% పోలింగ్ నమోదు అవ్వటం పార్టీలకు అంతు చిక్కటం లేదు. ఇక్కడ ఉన్న 24 సీట్లు ఎవరు అధికారంలోకి రావాలన్నా కీలకంగా మారనున్నాయి.

ఇక ఎంత శాతం మేర పోలింగ్ జరిగితే ఎవరికి కలిసి వస్తుంది..ఏ నియోజకవర్గంలో ఎవరిని గెలిపిస్తుంది అనేది లెక్కలు మొదలయ్యాయి. పోలింగ్ సరళి పైన పార్టీల అభ్యర్దులు ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయాలకు సమాచారం ఇస్తున్నారు. అయితే, హోరా హోరీ పోరుగా కనిపిస్తున్నా..ప్రజలు ఒకే పార్టీకి కావాల్సిన మెజార్టీ ఇస్తున్నట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. అదే స్థాయిలో పోరాడిన మరో పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
జిల్లాల వారీగా: ఇక, జిల్లాల వారీగా చూస్తే అదిలాబాద్ 41.88%, భద్రాద్రి 39.29%, హనుమకొండ 35.29%, హైద్రాబాద్ 20.79%, జగిత్యాల46.14%, జనగాం 44.31%, భూపాలపల్లి49.12%, గద్వాల్ 49.29%, కామరెడ్డి40.78%,
కరీంనగర్40.73%, ఖమ్మం42.93%, ఆసిఫాబాద్42.77%, మహబూబాబాద్46.89%, మహబూబ్ నగర్ 44.93%, మంచిర్యాల42.74%, మెదక్50.80% , మేడ్చల్26.70%, ములుగు45.69%, నాగర్ కర్నూల్39.58%,
నల్గొండ39.20%, నారాయణపేట42.60%, నిర్మల్41.74%, నిజామాబాద్39.66%, పెద్దపల్లి44.49%, సిరిసిల్ల39.07%, రంగారెడ్డి29.79%, సంగారెడ్డి42.17%, సిద్దిపేట 44.35%. సూర్యాపేట 44.14%, వికారాబాద్ 44.85%
వనపర్తి 40.40%, వరంగల్ 37.25%, యాదాద్రి 45.07% శాతం మేర పోలింగ్ నమోదైంది.
గెలుపుపై ధీమా: ఓటరు సరళి అర్దం కావటంతో మిగిలిన సమయం అనుకూలగా మలచుకొనేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మరో గంటన్నార సమయంలో...మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.
నియోజకవర్గాల వారీగా ప్రధాన రేసులో ఉన్న రెండు పార్టీల వద్ద పూర్తి సమాచారం చేరుతోంది. రెండు పార్టీలు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పోటీలో ఉన్న అభ్యర్దులు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. దీంతో..సాయంత్రం పోలింగ్ తరువాత పార్టీలు తమదే గెలుపు అంటూ ఇదే ధీమా కొనసాగించినా..అసలు ఓటరు తీర్పు ఏంటనేది మాత్రం డిసెంబర్ 3న తేలనుంది.












Click it and Unblock the Notifications