3డి వెలుగులు: తిలకించిన కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ సంబురాల సందర్భంగా నగరం సప్తవర్ణల్లో కాంతులీనుతోంది. క్లాక్‌టవర్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ట్యాంక్‌బండ్, సచివాలయ ప్రాంతాల్లో త్రీడీ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు విరజిమ్ముతున్నాయి.
కాగా, త్రీడీ లైటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం సిఎం కె చంద్రశేఖర్ రావు సందర్శించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిహెచ్ఎంసి స్పెషల్ కమిషనర్ సోమేష్ కుమార్‌తో కలిసి శుక్రవారం రాత్రి త్రీడీ మ్యాపింగ్ లైటింగ్ సౌండ్ సిస్టంను తిలకించారు.

3డి కాంతుల్లో కాచిగూడ రైల్వే స్టేషన్
హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

3డి కాంతుల్లో కాచిగూడ రైల్వే స్టేషన్
రాష్ట్ర ఆవిర్భావ సంబురాల సందర్భంగా నగరం సప్తవర్ణల్లో కాంతులీనుతోంది.

3డి కాంతుల్లో కాచిగూడ రైల్వే స్టేషన్
క్లాక్‌టవర్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ట్యాంక్‌బండ్, సచివాలయ ప్రాంతాల్లో త్రీడీ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు విరజిమ్ముతున్నాయి.

3డి కాంతుల్లో కాచిగూడ రైల్వే స్టేషన్
కాగా, త్రీడీ లైటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం సిఎం కె చంద్రశేఖర్ రావు సందర్శించారు.

తిలకిస్తున్న కెసిఆర్
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిహెచ్ఎంసి స్పెషల్ కమిషనర్ సోమేష్ కుమార్‌తో కలిసి శుక్రవారం రాత్రి త్రీడీ మ్యాపింగ్ లైటింగ్ సౌండ్ సిస్టంను తిలకించారు.

వేడుకలు
రవీంద్రభారతి ప్రాంగణంలో అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన వేదికపై కథక్ కళాకారులు రాఘవరాజ్ భట్, మంగళాభట్ ప్రదర్శన ఆకట్టుకుంది.

వేడుకలు
అనంతరం వడ్డేపల్లి కృష్ణ రచించిన జయ జయహే తెలంగాణ సంగీత నాట్యరూపకాన్ని పలువురు కళాకారులు ప్రదర్శించారు.

వేడుకలు
మరో వైపు ఆరుబయట ప్రాంగణంలో గ్రామీణ కళారూపాలను ప్రదర్శించారు.

వేడుకలు
దర్శనం మొగిలయ్య పన్నెండు మెట్ల కిన్నర వాద్యంతో ముందుకు రాగా, దురిశెట్టి రామయ్య కడ్డి తంత్రి వ్యాదంతో కథాగానం చేశారు.

వేడుకలు
కూనపులి రమేష్ పటం కథను, మొతె జగన్నాథం కొయ్యబొమ్మలాట కళారూపాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. కల్లూరి వెంకటేశ్వర్లు శిష్య బృందం బతుకమ్మ వైభవం నాట్యరూపకాన్ని జనరంజకంగా ప్రదర్శించింది.
శిల్పారామంలో వేడుకలు
సంబరాల్లో భాగంగా మాదాపూర్ శిల్పారామంలో శుక్రవారం కళాకారులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భావనాచార్యులు స్వరపరిచిన చేనేత చమక్కులు నృత్యరూపాకాన్ని భారతి శ్రీకాంత్ బృందం అద్భుతంగా ప్రదర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ విధ్యార్థులు సుస్మితాదాస్, బర్నాలి దాస్, శ్రేయసీ దాస్, జానేమియాషేక్ కూచిపూడి, భరత నాట్యం ఆకట్టుకుంది.
రవీంద్రభారతి ప్రాంగణంలో అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన వేదికపై కథక్ కళాకారులు రాఘవరాజ్ భట్, మంగళాభట్ ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం వడ్డేపల్లి కృష్ణ రచించిన జయ జయహే తెలంగాణ సంగీత నాట్యరూపకాన్ని పలువురు కళాకారులు ప్రదర్శించారు. శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు.












Click it and Unblock the Notifications