కలిసిరాని కాలం, లెక్క తేడా కొడుతోంది - అక్కడే డిసైడ్..!!
తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. గతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో, పార్టీలు ఓటరు నాడి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, గ్రేటర్ పరిధిలో మాత్రం పోలింగ్ చాలా మందకోడిగా కనిపిస్తోంది. 24 స్థానాలు ఉన్న గ్రేటర్ లో ఇతర రాష్ట్రాల ఓటర్లు ఓట్లు వేసేందుకు ఈ సమయం వరకు పెద్దగా ఉత్సాహం చూపటం లేదు. అధికారం దక్కించుకోవటంలో కీకలమైన గ్రేటర్ లో పరిస్థితి పార్టీలకు టెన్షన్ పెంచుతోంది.
పెరగని ఓటింగ్ శాతం : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇతర రాష్ట్రాల మూలాలు ఉన్న వారి సంఖ్య ఎక్కువ. ఇక్కడ తొలి నాలుగు గంటల్లో తెలంగాణలోని ఇతర జిల్లాల కంటే తక్కువ ఓటింగ్ శఆతం నమోదైంది. అన్ని వర్గాల ఓటర్లు ఇక్కడ ఉండటంలో ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ గెలుపు పైన ఆశలు పెట్టుకున్నాయి.

కానీ, తొలి రెండు గంటల్లో 4.57 శాతమే పోలింగ్ నమోదలైంది. సినీ సెలబ్రెటీలు..పలువురు ప్రముఖులు పోలింగ్ కోసం క్యూ లైన్లలో కనిపించారు. 2018 ఎన్నికల్లోనూ 50 శాతం పోలింగ్ కంటే నమోదు కాలేదు. గ్రేటర్ పరిధిలో మొత్తం 1కోటి 9 లక్షల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ పరిధిలో పోలింగ్ శాతం సగానికి మించడంలేదు.
పార్టీల్లో కొత్త టెన్షన్ : గ్రేటర్ లో స్థిర పడిన వారి మద్దతు కూడగట్టేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. గ్రేటర్ పరిధిలో 24 సీట్లు ఉండగా..కోర్ సిటీలో 15 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 2014 ఎన్నికల్లో గ్రేటర్‌లో ఎక్కువ సీట్లు గెలవకపోయినా.. 2018 వచ్చే సరికి పూర్తి స్థాయిలో విపక్ష పార్టీలపై పైచేయి సాధించింది బీఆర్ఎస్. ఎంఐఎం తమకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో తిరిగి బలం నిరూపించుకొనే ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్ ఈ సారి గ్రేటర్ లో తమ సత్తా చాటేందుకు అన్ని వ్యూహాలు అమలు చేసింది. 24 సీట్లు ఉన్న ప్రాంతం కావటంతో అన్ని పార్టీలకు గ్రేటర్ కీలకంగా నిలుస్తోంది. కానీ, ఇక్కడ పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. సెలబ్రెటీలు సైతం ఓటింగ్ కోసం ముందుకు రావాలని అభ్యర్ధిస్తున్నారు.
లెక్కలు మారుతాయా : వరుస సెలవులు సైతం ఓటింగ్ పైన ప్రభావం చూపిస్తున్నాయి. రాజేంద్ర నగర్ లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా కనిపిస్తోంది. ఎల్బీ నగర్, శేరిలింగం పల్లి, కుత్బుల్లాపూర్, కుకుట్ పల్లిలో సీమాంద్ర ప్రాంత మూలాలు ఉన్న ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ సారి పవన్ కల్యాణ్ తమ అభ్యర్దిని కుకట్ పల్లిలో బరిలోకి దించారు.
సీమాంధ్ర ప్రాంత ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఏపీ ఓటర్లు ఇక్కడ ఫలితాల పైన ఆసక్తితో ఉన్నారు. అయితే, ఓటింగ్ శాతం స్వల్పంగా ఉండటంతో పార్టీల లెక్కలు తేడా వస్తోంది. అధికారం డిసైడ్ చేయగల స్థాయిలో ఇక్కడ నియోజకవర్గాలు ఉండటంతో తుది ఫలితం పైన ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఉత్కంఠ మొదలైంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications