ఔటర్‌పై ఘోర ప్రమాదం: నుజ్జునుజ్జైన లారీలు, నలుగురు మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు రక్తసిక్తమైంది. హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ద్విచక్ర వాహనందారుడిని ఓ లారీ డ్రైవర్ చిరునామా అడుగుతున్న నేపథ్యంలో వెనుక నుంచి వస్తున్న కర్ణాటకు చెందిన మరో లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌కు సమీపంలోని సింపెక్స్ యూటర్న్ వద్ద జరిగిన దుర్ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. శంషాబాద్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా, ఆత్మకూర్‌కు చెందిన మారెప్ప, శేఖర్, సదా, ఆనంద్, శ్రీనివాస్, ఎస్ సదా, పవన్, హన్మంతులు గొర్రెల కాపరులు.
ప్రతి వారం వీరు నగరంలోని జియాగూడ మేకల మండీకి వచ్చి జీవాలను కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. వీరంతా బుధవారం జియాగూడకు రావాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో కర్ణాటక నుంచి డ్రైవర్ ఇనాయత్, క్లీనర్ శీనప్పలు క్యారెట్ల లోడ్ లారీలో హైదరాబాద్ వస్తూ దారి మధ్యలో ఆత్మకూర్‌లో ఆ ఎనిమిది మందిని ఎక్కించుకున్నారు.
గురువారం తెల్లవారుజామున 3గంటలకు శంషాబాద్ సమీపానికి చేరుకున్నారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై మల్లికా గార్డెన్ యూ టర్న్ వద్ద తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఒక లారీ ఆగి ఉంది. ఆ లారీ డ్రైవర్ కిందకు దిగి ఓ ద్విచక్ర వాహనదారుడిని ఆపి చిరునామా అడుగుతున్నాడు.
ఇంతలోనే కర్ణాటక నుంచి వస్తున్న లారీ వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో కర్ణాటక లారీ ముందు భాగంలో కూర్చున్న మారెప్ప (60), శేఖర్ (38), క్లీనర్ శీనప్ప(45)తో పాటు రహదారిపై చిరునామా చెబుతున్న పాత బస్తీకి చెందిన ద్విచక్ర వాహనదారుడు అబ్దుల్‌కలీం (30)లు అక్కడికక్కడే మృతి చెందారు.
లారీ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. లారీ క్యాబిన్‌పై కూర్చున్న సదా, శ్రీనివాస్, ఆనంద్, ఎస్.సదా, తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పవన్, హన్మంత్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, 108 అంబులెన్స్‌లు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద బయటి తీశారు. ఈ ప్రమాదానికి కారణమైన కర్ణాటకకు చెందిన లారీ డ్రైవర్ ఇనాయత్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.
చిరునామా చెప్పేందుకని ఆగిన ద్విచక్రవాహనదారుడు అబ్దుల్‌కలీం లారీ చక్రాల కింద నలిగిపోయాడు. తమిళనాడు లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు డ్రైవర్ ఇనాయత్ నిద్రమత్తులో ఉండటంమే ఈ ప్రమాదానికి కారణమని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుధాకర్ తెలిపారు.

ఘోర ప్రమాదం
హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఘోర ప్రమాదం
ఓ ద్విచక్ర వాహనందారుడిని ఓ లారీ డ్రైవర్ చిరునామా అడుగుతున్న నేపథ్యంలో వెనుక నుంచి వస్తున్న కర్ణాటకు చెందిన మరో లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

ఘోర ప్రమాదం
గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌కు సమీపంలోని సింపెక్స్ యూటర్న్ వద్ద జరిగిన దుర్ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

ఘోర ప్రమాదం
కర్ణాటక లారీ ముందు భాగంలో కూర్చున్న మారెప్ప (60), శేఖర్ (38), క్లీనర్ శీనప్ప(45)తో పాటు రహదారిపై చిరునామా చెబుతున్న పాత బస్తీకి చెందిన ద్విచక్ర వాహనదారుడు అబ్దుల్‌కలీం (30)లు అక్కడికక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications