వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 Rupees Coin: చిన్నారి ప్రాణాలు తీసిన ఐదు రూపాయల బిళ్ల.. బయటకు తీసినా దక్కని పాప ప్రాణాలు.

|
Google Oneindia TeluguNews

పిల్లలను ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారు ఏం చేస్తున్నారో గమనిస్తుండాలి. లేకుంటే తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలే అవకాశం ఉంది. ఇలానే ఓ పాప ఐదు రూపాయిల బిళ్ల మింగింది. అది గొంతులో ఇరుక్కోవడంతో మృతి చెందింది.ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది. భూదాన్‌ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేసింది. అది గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు.

అస్వస్థకు గురైన చిన్నారి
చైత్ర సోమవారం ఉన్నట్టుండి అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో తల్లిదండ్రులు అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముద్దుముద్ద మాటలతో అల్లరి చేస్తూ ఆడుకునే చిన్నారి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే ఇంత చేసిన వైద్యులు పాపకు ఇన్ఫేక్షన్ సోకినట్లు ఎందుకు గుర్తించలేకపోయారో తెలియడం లైదంటున్నారు.

4 Year Old baby Dies After Swallowing Five Rupee Coin in Bhoodan Pochampally‌

తల్లిదండ్రులూ జాగ్రత్త
అందుకు చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. ముఖ్య వారు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమినించాలి. వారు చేతులో ఏం ఉంది. వారు ఏం చేస్తున్నారో గమినిస్తూ ఉండాలి. ముఖ్యంగా వారికి చిల్లర పైసలు అస్సలు ఇవ్వకూడదు. అలాగే కారు ఉన్నావాళ్ల పిల్లలను ఒంటరిగా కారు ఎక్కనివ్వకూడదు. ఒక్కోసారి కారు డోర్లు లాక్ అయి పిల్లలకు ఊపిరి ఆడదు.

English summary
4 Year Old baby Dies After Swallowing Five Rupee Coin at Bhoodan Pochampally‌ yadadri bhuvanagiri district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X