వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుకుల పాఠశాలలో కరోనా కలవరం.. 42 మంది విద్యార్థులకు వైరస్, ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

అసలే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఒకరికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నాయనే విషయం టెన్షన్ కలిగిస్తోంది. ఇదీ నిర్ధారణ కాకపోయినా.. బెంగళూరులో ఇద్దరికీ డెల్టా వచ్చినట్టు నిర్ధారించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గల కరోనా కేసుల విషయానికి వస్తే.. సంగారెడ్డి జిల్లాలో కేసులు వచ్చాయి. అదీ గురుకుల స్కూల్‌లో కేసులు వచ్చాయి.

ముత్తంగి గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా వచ్చింది. స్కూల్‌లో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. ఆదివారం 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్ష నిర్వహించారు. మిగిలినవారికి కూడా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినవారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. పాజిటివ్‌ వచ్చినవారిని హాస్టల్‌లో క్వారంటైన్‌లో ఉంచారు. అవసరమైతే వారందరికి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. కానీ ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. నిపుణులు మాత్రం జనవరిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి మళ్లీ వేసవి ఎలా ఉంటుందోననే ఆందోళన ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎక్కడో.. ఎవరో కొందరు తీసుకోలేదు. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. కానీ ఇంతలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ ఆందోళన కలిస్తోంది. సౌతాఫ్రికాలో ఆవిర్భవించగా.. మిగతా దేశాలకు కూడా పాకుతుంది.

42 students infected virus at muttangi gurukul school

కొత్త వేరియంట్‌ను ఒమ్రికాన్ అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి.

మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు. అయితే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించాల్సి ఉంటుంది.

English summary
42 students infected corona virus at sangareddy district muttangi gurukul school. student health is stable doctors said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X