5వేల కోట్ల భారీ బడ్జెట్.. తెలంగాణాకు కేంద్ర రైల్వేశాఖ అదిరిపోయే గుడ్ న్యూస్!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపైన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన ప్రకటనలు చేశారు. నేడు హైదరాబాద్ లో పర్యటించిన ఆయన అనేక కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణాలో దక్షిణ భారతదేశంలో రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేసేలా రైల్వే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణా రాష్ట్ర రైల్వే ప్రాజెక్ట్ లకు 5వేల కోట్ల భారీ నిధులను కేటాయించినట్టు చెప్పారు.
వికసిత్ భారత్ 2047 సాంకేతికత పాత్ర సదస్సులో రైల్వే మంత్రి
హైదరాబాద్ మహానగరాన్ని పరుగులు పెట్టించేలా రెండు ప్రధాన మెట్రో నగరాలైన చెన్నై మరియు బెంగళూరు లతో అనుసంధానం చేస్తూ సరికొత్త బుల్లెట్ రైలు కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించిన వికసిత్ భారత్ 2047 సాంకేతికత పాత్ర అనే ప్రతిష్టాత్మక సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్న రైల్వేశాఖ మంత్రి ఈ మేరకు పలు కీలక విషయాలను వెల్లడించారు.

దక్షిణ భారతదేశ రాష్ట్రాలను కలుపుతూ బుల్లెట్ రైల్ కారిడార్
త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ కొత్త బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే గంటకు 300 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చని, కేవలం రెండున్నర నుండి మూడు గంటల లోపే గమ్యస్థానాలకు చేరుకోవచ్చని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి
దీనికి సంబంధించి dpr పనులు తుది దశకు చేరుకున్నాయి అన్నారు. ఇక ఇదే సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. మొత్తం దేశవ్యాప్తంగా 1300 స్టేషన్ల ఆధునీకరణ పనులు చేపట్టామని, వెల్లడించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని 40 స్టేషన్లు ఉన్నాయని ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ గా తీర్చి దిద్దుతున్నామని ఆయన అన్నారు.
బుల్లెట్ రైల్ కారిడార్ లకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభం
ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ ల ఆధునీకరణ పనులు పూర్తి కావచ్చాయని అన్నారు. దక్షిణ భారత రైల్వే కారిడార్లలో అత్యంత సురక్షితమైన, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాము అని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుల్లెట్ రైల్ కారిడార్ లకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. తెలంగాణా రాష్ట్రానికి భారీ రైల్వే బడ్జెట్ కేటాయింపులు చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications