coronavirus: మరో 52 కేసులు నమోదు, ఒకరి మృతి, తెలంగాణలో 18కి చేరిన మృతుల సంఖ్య..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మంగళవారం 52 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరుకున్నది.
మంగళవారం ఏడుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒకరు వైరస్ సోకి చనిపోయారని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. కరోనా వైరస్ సోకి మంగళవారం ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 110 మంది కాగా.. 516 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తామని పేర్కొన్నారు. 20వ తేదీ తర్వాత ఆంక్షలను సడలిస్తామని.. ఈ మేరకు బుధవారం గైడ్ లైన్స్ విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఏప్రిల్ 14వ తేదీన లాక్ డౌన్ గడువు ముగియనుండగా..ఇప్పటికే తెలంగాణ రాష్రం లాక్ డౌన్ ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇవాళ ప్రధాని మోడీ.. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోందని స్పష్టచేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications