తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు... ఒకరు మృతి..

తెలంగాణలో శనివారం నాడు కొత్తగా 52 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1813కు చేరుకుంది. కొత్త కేసుల్లో హైదరాబాద్‌ పరిధిలో 33 కేసులు నమోదవ్వగా.. 15 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే వందే భారత్ మిషన్‌లో భాగంగా కువైట్ నుంచి తిరిగొచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొంది.

శనివారం కరోనాతో ఒకరు మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 49కి చేరినట్టు పేర్కొంది. ఇక ఇవాళ ఒక్కరోజే 25 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటివరకూ మొత్తం 1068 మంది డిశ్చార్జి అయినట్టు తెలిపింది. ప్రస్తుతం 696 యాక్టివ్ కేసుల కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకూ 59 శాతం మంది డిశ్చార్జి అవగా.. 3 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది.

52 new coronavirus cases reported in telangana on saturday

రాష్ట్రంలో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇక వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
కానీ జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 30కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గురువారం 38 కేసులు,శుక్రవారం 62 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+