తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: 9వేల దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లావారీగా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది.
అయితే, ఒక్కోసారి కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,07,329 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 582 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు, 3 మరణాలు
తాజాగా, నమోదైన 582 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,47,811కు చేరింది. కరోనాతో కొత్తగా ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3817కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1459 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో 8,744 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 638 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,35,250కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,744 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.05 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 12, జీహెచ్ఎంసీలో 83. జగిత్యాలలో 24, జనగామలో 08, జయశంకర్ భూపాలపల్లిలో 06, జోగులాంబ గద్వాలలో 01, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 61, ఖమ్మంలో 45, కొమురంభీం ఆసిఫాబాద్ లో 04, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 11, మంచిర్యాలలో 17, మెదక్‌లో 06, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 27, ములుగులో 07, నాగర్ కర్నూలులో 04, నల్గొండలో 39, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 04, నిజామాబాద్‌లో 05, పెద్దపల్లిలో 22, రాజన్న సిరిసిల్లలో 17, రంగారెడ్డిలో 26, సంగారెడ్డిలో 09, సిద్దిపేటలో 18, సూర్యాపేటలో 26, వికారాబాద్ లో 02, వనపర్తిలో 06, వరంగల్ రూరల్‌లో 07, వరంగల్ అర్బన్‌లో 61, యాదాద్రి భువనగిరిలో 16 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒక్క కామారెడ్డి, నారాయణపేట్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Recommended Video

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 16,64,030 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 42,982 మందికి కరోనా సోకినట్లు తేలింది. బుధవారం 533 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.18 కోట్లకు చేరింది. ఇక మరణాల సంఖ్య 4,26,290 మందికి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,11,076 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 41,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 3.09 కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 37,55,115 మందికి టీకా పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 48.93 కోట్లకు చేరింది. కాగా, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు సుమారు సగం కేసులు కేరళ నుంచే ఉంటుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తి చేసిన కేంద్రం ఇప్పటికే వైద్యుల బృందాన్ని కేరళకు పంపింది.












Click it and Unblock the Notifications