హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలికపై వీధి కుక్కల దాడి, పరిస్ధితి విషమం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై పది వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన కర్మన్‌ఘాట్ డివిజన్ కృష్ణానగర్‌లో గురువారం చోటు చేసుకుంది.

స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం కళా వెంకటేశ్ దంపతులు కృష్ణానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె స్వాతి స్ధానిక అల్పాన్సా స్కూలులో ఒకటో తరగతి చదువుతోంది. బాలిక వయసు 6 సంవత్సరాలు.

గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఆ ప్రాంతానికి వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా బాలికపై దాడి చేసి గాయపర్చాయి. కన్న తల్లి చూస్తుండగానే కుక్కలు బాలికపై ఎగబడి మరీ గాయపర్చాయి.

6 year old girl attacked by street dogs in hyderabad

హూటాహుటిన బాలికను సమీపంలోని మెడికేర్ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి వైద్యుల సలహా మేరకు నారాయణగూడలోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో వీధి కుక్కలు ప్రజలను మరింతగా గాయపరుస్తున్నాయి.

గతంలో కూడా వనస్ధలిపురంలో ఓ బాలికపై దాడి చేసిన విషయం తెలిసిందే. వీధి కుక్కులను పట్టుకోవడంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

ఎల్‌బీనగర్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి సోనీ పరిస్ధితి విషమం:

ఎల్‌బీనగర్‌లో వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ప్రస్తుతం సోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి సోని పెడుతున్న రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది. ఎల్‌బీనగర్‌లో వీధికుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతూ వచ్చే పోయే వారిపై దాడికి దిగుతున్నాయని, అక్కడి స్ధానికులు వాపోతున్నారు.

English summary
5 year old girl attacked by street dogs in LB Nagar, hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X