తెలంగాణలో కరోనా విజృంభణ: 600 దాటిన కొత్త కేసులు, 5వేలు దాటిన యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 600 దాటింది.
28,055 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 608 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 8,05,137 మంది వైరస్ భారిన పడ్డారు.

మరో 459 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7,95,880 మంది కొవిడ్ నుంచి కొలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 5,146 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ 329, ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 5, జగిత్యాల 6, జనగామ 7, గద్వాల 1 , కరీంనగర్ 10, ఖమ్మం 11, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 4, మంచిర్యాల 5, మెదక్ 1 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 54, నాగర్ కర్నూల్ 2, నల్గొండ 7, నారాయణపేట్ 4, నిజామాబాద్ 10, పెద్దపల్లి 12, సిరిసిల్ల 4, రంగారెడ్డి 67, సంగారెడ్డి 16, సిద్దిపేట 6, వికారాబాద్ 7, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 2, యాదాద్రి 6 కరోనా కేసుల చొప్పున నమోదయ్యాయి.

608 new coronavirus cases reported in telangana state

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. కరోనా నిబంధనలు పాటించాలని కోరింది. వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,79,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా..
18,815 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గాయి. కొవిడ్​ నుంచి 15,899 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.52 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.27 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది.

కరోనా మొత్తం మరణాలు 5,25,343కు పెరిగాయి. దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 1,22,335కు చేరింది. కోలుకున్నవారి సంఖ్య 4,29,37,876కు పెరిగింది.
భారతదేశంలో గురువారం 17,62,441 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,51,77,962కు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+