వృద్ధుడి మృతి: దరఖాస్తులకు రద్దీ (పిక్చర్స్)

హైదరాబాద్: సామాజిక భద్రత వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చి క్యూలో నిలబడిన వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందిన సంఘటన హైదరాబాదులోని మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.

దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు ఎమ్మార్వో కార్యాలయాల వద్ద పోటెత్తారు. ఈ స్థితిలో అక్బర్‌బాగ్ డివిజన్ సపోటాబాగ్‌లో వుండే అజాంఖాన్ (68)కి భార్య, ఆరుగురు సంతానం. కొన్నేళ్లుగా సైదాబాద్ మండల పరిధిలో నెలనెలా వృద్ధాప్య పింఛన్‌ను పొందుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం పింఛన్‌దారులు కొత్తగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్న నిర్ణయంతో మంగళవారం వివేకానంద పాఠశాలలో ఏర్పాటుచేసిన కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చి క్యూలో నిలుచున్నాడు.

ఎక్కువసేపు నిలబడి వుండడంతో సొమ్మసిల్లి కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు 108కి సమాచారమివ్వగా సిబ్బంది చేరుకుని చూడగా అజాంఖాన్ అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. కుటుంబసభ్యులు వచ్చి తమకు ఎలాంటి కేసు అవసరం లేదని పోలీసులకు చెప్పి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చౌక ధరల దుకాణాలు, మున్సిపల్ వార్డులు, మండల రెవెన్యూ కార్యాలయాల్లో తీవ్రమైన రద్దీ చోటు చేసుకుంది.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

ప్రజల సౌకర్యార్థం అదనపు కౌంటర్లు తెరవాలని మండల, మున్సిపల్ కార్యాలాయాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీకి పొడగించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆ పనిచేసింది.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

ఆహార భద్రతతో పాటు వివిధ కెటగిరీల కింద మంగళవారంనాడు ఒక్కరోజే హైదరాబాద్ జిల్లాలో లక్షా మూడు వెల దరఖాస్తులు అందాయి.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

ఆహార భద్రతా కార్డులతో పాటు వివిధ పింఛన్లకు, స్థానికతకు, కుల ధ్రువీకరణకు, ఆదాయానికి సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడ లేని రద్దీ చోటు చేసుకుంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

వివిధ కెటగిరీల కింద ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనం కోసం సర్టిఫికెట్లు పొందడానికి ప్రజలు హైదరాబాదులో పోటెత్తారు.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

హైదరాబాదులోని అంబర్ పేట, మలక్‌పేట.. ఒక్కటేమిటి అన్ని ప్రాంతాల్లో ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి పెద్ద యెత్తున తరలి వచ్చారు.

దరఖాస్తులకు రద్దీ

దరఖాస్తులకు రద్దీ

తెల్ల కాగితంపై వివరాలు రాసి ఇస్తే చాలు, సర్టిఫికెట్లు జారీ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

దరఖాస్తుల రద్దీ

దరఖాస్తుల రద్దీ

తెల్ల కాగితాల కోసమే కాకుండా ఇతర వివరాల కోసం ప్రజలు పెద్ద యెత్తన పోటీ పడ్డారు. కాగితాల ధరలు కూడా పెరిగిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+