కారును పోలిన.. ఆ 8 గుర్తులను తొలగించండి: సీఈవోకు టీఆర్ఎస్, బండిపై ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) గుర్తు కారును పోలిన 8 గుర్తులు ఉన్నాయని, వాటిని తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నేతలు కోరారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, భాను ప్రసాదరావు, భరత్ కుమార్.. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ 8 గుర్తులను తొలగించాలంటూ టీఆర్ఎస్

ఈ 8 గుర్తులను తొలగించాలంటూ టీఆర్ఎస్

ఎన్నిక గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతి రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై 48 గంటల్లో స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. గతంలో కారును పోలిన గుర్తుల కారణంగా స్వల్ప మెజార్టీతో పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు.

ఆ 8 గుర్తులతో వచ్చే సమస్య ఇదేనంటూ టీఆర్ఎస్

ఆ 8 గుర్తులతో వచ్చే సమస్య ఇదేనంటూ టీఆర్ఎస్

పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. కారును పోలి ఉన్నందునే వాటికి ఓట్లు పడినట్లు స్పష్టమవుతోందన్నారు. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని గుర్తు చేశారు. ఈ కారణంగానే ఆ 8 గుర్తులను తొలగించాలని కోరామన్నారు.

బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఫిర్యాదు

బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఫిర్యాదు

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. కేసీఆర్‌పై క్షుద్రపూజల వ్యాఖ్యలు చేస్తూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పిచ్చి లేసింది. అందుకే దేవుడితో సమానమైన సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల పార్టీకి తెలంగాణలో రోజురోజుకు ఆదరణ తగ్గుతుండటంతో ఇలా వ్యవహరిస్తోందన్నారు. బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్‌ను కోరామని ఎమ్మెల్సీ భానుప్రసాద్ తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు రాసిచ్చిన స్క్రిప్ట్ నే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదవడం మూర్ఖత్వమేనని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+