Warangal: చిట్టితల్లి బడికి వెళ్లు.. రేపు పండుగ చేసుకుందాం.. అంతలోనే పాము కాటు..

వరంగల్ జిల్లాలో పాఠశాలలో పాముకాటుతో 6 ఏళ్ల బాలిక మృతి చెందింది.

చిట్టితల్లి రేపు మన ఇంట్లో పండుగ చేస్తున్నాం.. నీకు చెవులు కుట్టిస్తున్నాం.. రేపు చుట్టాలు అందురూ వస్తారు. ఈ రోజు నువ్వు బడికి వెళ్లు అని తల్లి చెప్పింది. తల్లి మాటలతో ఆనందంగా ఆ చిట్టితల్లి పాఠశాలకు వెళ్లింది. స్కూల్ తన స్నేహితలకు తనకు రేపు చెవులు కుట్టిస్తున్నారని చెప్పి మురిసిపోయింది. కానీ ఆ పాప ఆనందం ఎంతో సేపు నిలవలేదు

ఇద్దరు కుమార్తెలు

ఇద్దరు కుమార్తెలు

ఆ చిట్టితల్లిన మృత్యురూపంలో వచ్చిన పాము కాటేసింది. పాము కాటుకు గురైన చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారులోని భట్టుతండాకు చెందిన భట్టు మోహన్, పార్వతిలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద బిడ్డ భట్టు మన్విత తండాలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటుంది.

నడుచుకుంటూ వస్తుండగా

నడుచుకుంటూ వస్తుండగా

బుధవారం ఉదయం మన్విత పాఠశాలలకు వెళ్లింది. గురువారం తనకు చెవులు కుట్టిస్తున్నారని స్నేహితులకు చెప్పింది. ఈ క్రమంలో తనకు బాత్ రూం వస్తుందని చెప్పడంతో ఉపాధ్యాయుడు వెళ్లమని చెప్పాడు. తరగతి గది నుంచి మన్విత నడుచుకుంటూ వస్తుండగా పాము కాటేసింది. దీంతో మన్విత అరవడంతో ఉపాధ్యాయుల అక్కడి వచ్చారు. తనకి పాము కుట్టిందని చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

ప్రవీణ్ కుమార్

ప్రవీణ్ కుమార్

అక్కడి చేరుకున్న మోహన్ కూతుర్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మన్విత మరణించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా
పాప మృతికి కారణం ఎవరో చెప్పాలంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

మన ఊరు/మన బడి

మన ఊరు/మన బడి పథకం పేరిట కోట్ల రూపాయలు మెఘా-ర్పణం చేసి, పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నారి మృతికి కారణం ఎవరో చెప్పాలన్నారు. ఈ పాపం ఎవరిది? వందల కోట్లు ఏ పందికొక్కులు బుక్కినయ్? ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ను నిర్వీర్యం చేయడమేనా మీ లక్ష్యమా అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+