Street Dogs Attack: బాలుడిపై వీధి కుక్కల దాడులు.. ఆస్పత్రికి తరలింపు..

రాష్ట్రంలో ఏదో ఓ చోట వీధి కుక్కలు పిల్లలపై దాడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లాలో వీధి కుక్కలు చెలరేగుతున్నాయి. ఓదెలా మండలం పోత్కపల్లిలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. సిలివేరి సాయ్ కుమార్ అనే బాలుడిపై వీధి కుక్కల దాడి చేశాయి. బాలుడు రోడ్డు పక్కన ఆడుకుంటుండగా.. కుక్కల ఒక్కసారిగా మీద పడి దాడి చేశాయి. దీంతో సాయి కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

బాలుడి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే మండలంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటే భయపడుతున్నట్లు చెప్పారు. వెంటనే వీధి కుక్కలను నియంత్రించాలని కోరారు. గతంలో కూడా రాష్ట్రంలో చాలా చోట్ల వీధి కుక్కల దాడులు జరిగాయి. కొద్ద నెలల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడు.

A boy was attacked by stray dogs in Peddapalli district

ఆ తర్వాత కాజీపేటలో ఓ బాలుడిని వీధి కుక్కలు కరిచి చంపాయి. కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం వెంకయ్య తండా, మేఘ్య తండాలలో 14 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. గాయపడ్డ వారిలో కొందరు మహిళలు, కొందరు చిన్నపిల్లలు ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కాజీగల్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని కరిచాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటనీతండాలో భరత్ అనే ఐదేళ్ల బాలుడిపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో ప్రాణాలు విడిచాడు.

హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డీఓ టౌన్‌షిప్‌లో ఐదు కుక్కలు మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే గమనించిన చుట్టుపక్కల వారు బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. జగిత్యాల జిల్లాలో వీధి కుక్కలు ప్రజలు దాడి చేశాయి. జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లో 10 రోజుల వ్యవధిలో 15 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+