Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొద్ది గంటల్లో పెళ్లినగా నవవధువు ఆత్మహత్య: వరుడిపై ఆరోపణలు, అసలేం జరిగింది?

నిజామాబాద్: జిల్లాలోని నవీపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అప్పటివరకు సందడిగా ఉన్న పెళ్లింట్లో విషాదం నెలకొంది. పెళ్లి కుమారుడే వేధించాడని యువతి కుటుంబసబ్యులు ఆరోపిస్తుండగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడు ఆ యువకుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఆత్మహత్య

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఆత్మహత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటకు చెందిన ర్యాగల రవళి(26)కు నిజామాబాద్ కు చెందిన సంతోష్ అనే యువకుడితో ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఈ రోజే అంటే ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు నిజామాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహం జరగాల్సింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం పెళ్లి కుమార్తె తమ ఇంట్లోని స్టోర్ రూంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

వరుడి వేధింపులే కారణమంటున్న వధువు తండ్రి..

వరుడి వేధింపులే కారణమంటున్న వధువు తండ్రి..

స్టోర్ రూం గది తలుపులు తెరిచి ఉండటాన్ని యువతి తండ్రి ప్రభాకర్ గమనించాడు. విగత జీవిగా ఉన్న కూతుర్ను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాబోయే పెళ్లి కొడుకు శనివారం రాత్రి 10.30 గంటలకు తమ కుమార్తెకు ఫోన్ చేశాడని, అతడు పెట్టిన మానసిక క్షోభతోనే ఆమె హత్యకు పాల్పడిందని ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెళ్లి కుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన మెహందీ వేడుకలో కూడా డ్యాన్స్ చేసి ఉత్సాహంగా గడిపిన రవళి.. ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబసభ్యులతోపాటు బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు.

తాను తప్పు చేయలేదంటూ నవరుడు, విచారణకు డిమాండ్

తాను తప్పు చేయలేదంటూ నవరుడు, విచారణకు డిమాండ్

మరోవైపు, తాను రవిళిని ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని సంతోష్ చెబుతున్నాడు. ఆగస్టులో తమకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ మధ్య ఎలాంటి గొడవలు జరగలేదన్నాడు. రవళిని తాను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదన్నాడు. ఒక సందర్భంలో జాబ్ చేస్తావా? అని మాత్రమే అడిగానని.. తాను చేయనని చెప్పడంతో తాను ఏమి అనలేదని చెప్పాడు. కేసును పూర్తిగా విచారించాలని, కాల్ రికార్డ్స్ అన్నీ బయటకు తీయాలని సంతోష్ డిమాండ్ చేస్తున్నాడు. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తనకు తెలియదని.. తాను ఆస్తి గురించి కూడా ఎప్పుడూ అడగలేదన్నాడు సంతోష్. పెళ్లి ఖర్చులు కూడా తానే పెట్టుకుంటున్నట్లు తెలిపాడు. సంతోష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. రవళి ఆత్మహత్యతో తమ కుమారుడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమపై ఆరోపణలు చేయడం షాక్ కి గురిచేసిందన్నారు. పోలీసులు విచారణ చేసి నిజానిజాలు తేల్చాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+