Bridge Collapse: కూలిన నిర్మాణంలోని వంతెన.. తప్పిన ప్రమాదం..
నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ లో జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య మానేరు నది పై బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. ఈ వంతెనతో ఓడేడ్ నుంచి గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గనుంది. 29 కోట్లతో వంతెన నిర్మాణాకి శంకుస్థాపన చేశారు. 2016 ఆగస్ట్ లో బ్రిడ్జి నిర్మాణం స్టార్ట్ చేశారు. బిల్లలు సరిగా రాకపోవడం, కాంట్రాట్ర్లు మారడంతో వంతెన నిర్మాణం ఆగిపోయింది.
9 సంవత్సరాలు గడిచిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. ప్రజలు వంతెన పక్కనే ఏర్పాటు చేసిన మట్టిదారిలో ప్రయాణం చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి గాలిదుమారానికి బ్రిడ్జి పైనున్న సిమెంట్ గడ్డర్స్ కిందపడిపోయాయి. ధరాత్రి సమయంలో బ్రిడ్జి గడ్డర్స్ పడిపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులుచెబుతున్నారు. వంతెన నిర్మాణం త్వరగా చేపట్టాలని ప్రజలు అడుగుతున్నారు. నాణ్యతతో బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.

నెల రోజుల క్రితం బీహార్ లో కూడా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సుపౌల్ కోసి నదిపై వంతెన నిర్మిస్తున్నారు. వంతెన స్లాబ్ ఒక్కసారి కూలిపోవడంతో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వారి సహాయ బృందాలు రక్షించాయి. అయితే ఒకరిని మాత్రం కాపాడలేకపోయారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో కూడా కొద్ది రోజుల క్రితం వంతెన కూలిపోయింది. మొరెనాలో 100 ఏళ్ల నాటి బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications