బాలికపై వ్యాపారి అత్యాచారం: భార్యను చంపిన భర్త
హైదరాబాద్: సికింద్రాబాదులోని బోయిన్‌పల్లి గ్రీన్‌ఫీల్డ్‌కి చెందిన వ్యాపారి అనిల్‌కుమార్ (48) అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై గురువారం అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు అనిల్‌కుమార్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
కూలీ ఆత్మహత్య
ఇదిలావుంటే,త హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో గల ఖాజాగూడలో ఓ కూలీ మనస్తాపంతో శుక్రవారం ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మండలి బుద్దు అలియాస్ రాజు (40) కుటుంబంతో కలిసి జీడిమెట్లలో ఉంటూ కూలి పని చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అతని పెద్ద కుమారుడు చనిపోయాడు. అప్పటినుంచి భార్యాభర్తలిద్దరూ మనోవేదనకు గురయ్యారు. 10 రోజులుగా బుద్దు ఖాజాగూడలోని లక్షా కన్‌స్ట్రక్షన్స్‌లో పనిచేస్తూ అక్కడే రేకుల షెడ్‌లో ఉంటున్నాడు.
రెండు రోజులుగా పనికి వెళ్లడం లేదు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో భార్య బయటకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చే సరికి బుద్ధు రేకుల షెడ్ కొక్కానికి తాడుతో ఊరేసుకున్నాడు. బుద్దు భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ భబ్యానాయక్ తెలిపారు.

భార్యను చంపిన భర్త
పథకం ప్రకారం భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్తను రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తక్కెలపాడు గ్రామానికి చెందిన లంకలపల్లి మదనాచారి (40), పెద్దవూర మండలం పైలాన్ కాలనీకి చెందిన మహేశ్వరి (36)తో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుటుంబసభ్యులందరూ హయత్‌నగర్‌లోని సాయినగర్‌లో నివాసముంటున్నారు.
కొంతకాలంగా మదనాచారి భార్యను కట్నం కోసం వేధిస్తున్నాడు. ఇదిలా ఉండగా గురువారం మదనాచారి భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర మైన గాయాలు కావడంతో మహేశ్వరి అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం మదనాచారి బావమరిది రామలింౄగాచారికి ఫోన్ చేసి ‘మీ అక్క ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది' అని చెప్పాడు.
రామలింగాచారి కుటుంబసభ్యులు సాయినగర్ కాలనీకి చేరుకుని శవాన్ని పరిశీలించారు. అనుమానంతో మదనాచారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మదనాచారి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications