Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు: అర్ధరాత్రి కిషన్ రెడ్డి, ఈటల, రాంచదర్ ఆందోళన

హైదరాబాద్ శివార్లలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఓ వాహనాన్ని అడ్డుకున్న వారిపై ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గోసంరక్షకుడు ప్రశాంత్ అలియాస్ సోనీ సింగ్ గాయపడ్డాడు. ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి పోచారం సమీపంలో జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రశాంత్ ను యశోద ఆసుపత్రికి తరలించారు.

పశువులను అక్రమంగా రవాణా చేస్తోన్నారనే సమాచారం అందడంతో ప్రశాంత్ తో పాటు మరో ఇద్దరు ఘట్ కేసర్ నుంచి పోచారం వెళ్తోన్న ఆ వాహనాన్ని వెంబడించారు. పోచారం వద్ద అడ్డకున్నారు. పశువులను తరలించడానికి అవసరమైన అనుమతి పత్రాలను చూపించాలని అడిగారు. వారివద్ద అలాంటి డాక్యుమెంట్లేవీ లేవు. దీంతో- ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో వాహనంలో ఉన్న ఇబ్రహీం ఖురేషి అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు.

A Cow Vigilante injured in Hyderabad

మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపాడు. ఓ బుల్లెట్ ప్రశాంత్‌కు తగిలింది. దీంతో రక్తమోడుతూ అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ప్రశాంత్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. శరీరంలో ఉన్న బుల్లెట్‌ను తొలగించడానికి సర్జరీ చేయాల్సి ఉందని అన్నారు.

ఈ ఘటనపై పోచారం పోలీసులు, ప్రత్యేక ఆపరేషన్స్ టీమ్ (SOT), క్రైమ్ టీమ్స్‌తో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఐటీ విభాగం సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటాను విశ్లేషించడం ద్వారా నిందితుడిని గుర్తించడంలో నిమగ్నమైంది. రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు, మల్కాజిగిరి డీసీపీ పీవీ పద్మజ సంఘటన స్థలాన్ని సందర్శించారు. దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.

ఈ సంఘటనపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. గో రవాణా మాఫియా, ఏఐఎంఐఎం ప్రమేయం ఉందని ఆరోపిస్తూ తక్షణ న్యాయం కావాలని, మాఫియా కార్యకలాపాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సోను తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయిదారు సంవత్సరాలుగా తన కుమారుడు అక్రమ గోవుల రవాణాను అడ్డుకుంటోన్నాడని తెలిపారు.

కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ గోవుల రవాణా మాఫియా కార్యకలాపాలను వెంటనే అరికట్టాలని, ఈ ఘటన వెనుక పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపించారు. డీజీపీ, ఇతర అధికారులతో మాట్లాడాననని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అన్నారు. ఇటీవలే నిజామాబాద్‌లో ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని గుర్తు చేశారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న మాఫియా కార్యకలాపాలను, గోవులను అక్రమంగా రవాణా చేసేవారిని, వధించేవారిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను భయపెట్టడానికి ఏఐఎంఐఎం గూండాలే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. గోవుల అక్రమ రవాణా గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఉందని ఆరోపించారు. ఎంఐఎం కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వెసలుబాటు వల్లే వాళ్లు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+