కవిత కేసు ఏం కాబోతోంది?: తీవ్ర ఉత్కంఠత

K Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేసులో నేడు తీర్పు వెలువడనుంది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలను జారీ చేయనుంది.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

A Delhi s Rouse Avenue Court to deliver of its order on K Kavitha s bail application today

మంగళవారం అంటే మే 7వ తేదీ నాటికి ఆమె జ్యుడీషియల్ కస్టడీని ముగియాల్సి ఉంది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించిన ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం దీనిపై విచారణను నేటికి వాయిదా వేసింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడానికి ఇంకా ఒకరోజు గడువు ఉన్నప్పటికీ- బెయిల్ పిటీషన్లపై విచారణ కొనసాగుతున్నందున ఈ ఉదయం కవితను న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నారు అధికారులు.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసుల్లో రోస్ అవెన్యూ కోర్టు ఎలాంటి తీర్పు వెలువడిస్తుందన్నది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. రోస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా.. కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్లను విచారిస్తోన్నారు.

ఇదే కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు బెయిల్ లభించలేదు. అదే సమయంలో- ఆమ్ ఆద్మీ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు మాత్రం గతంలో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కిందటి నెల 4వ తేదీన సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది.

కవితను మరో 10 రోజుల పాటు తమ జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలను జారీ చేయాలని సీబీఐ, ఈడీ అధికారులు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించిన నేపథ్యంలో మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని వారి తరఫు న్యాయవాది చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+