విషాదం: హెటిరో ల్యాబ్స్‌లో యంత్రంలో పడి ఉద్యోగి మృతి
హైదరాబాద్: నగరంలోని కుత్భుల్లాపూర్ హెటిరో ల్యాబ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ప్రొడక్షన్ ఆపరేటర్ మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రమాదవశాత్తూ కెమికల్స్ మిక్స్ చేసే యంత్రంలో పడి మహేందర్ (28) ప్రాణాలు కోల్పోయాడు.
రసాయనాలను మార్చే క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో ఆపరేటర్‌ను సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు మహేందర్. నిజామాబాద్‌కు చెందిన మహేందర్ మూడు సంవత్సరాలుగా ఫార్మా యూనిట్ 3లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే మహేందర్ మృతిని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మీడియా ప్రతినిధులను కంపెనీలోకి అనుమతించకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి.
పెళ్లి కాదేమోనని.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో విషాదంచోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. సురేఖ (28) అనే కానిస్టేబుల్ ఛాత్రినాక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోంది. ఆమె స్వస్థలం రంగారెడ్డి జిల్లా కందుకూరు. ఉద్యోగరీత్యా తన సోదరితో అలియబాద్ ప్రాంతంలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటుంది. తన సోదరి కూడా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించారు.
ఓ అబ్బాయితో రెండు రోజుల క్రితం సురేఖకు తమ ఇంటి వద్ద నిశ్చితార్థం కూడా చేశారు కుటుంబసభ్యులు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు తిరిగి హైదరాబాద్ వచ్చింది. అయితే అబ్బాయితో వరుస కాలవక జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుందేమోనని సురేఖ ఆవేదనకు గురైంది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న శాలిబండ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications