Viral Video: బస్సు పైకి దూసుకెళ్లిన ఇన్నోవా.. వైరల్ అయిన వీడియో..
మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎదుటి వారు కూడా వాహనం జాగ్రత్తగా నడపాలి. మనం వాహనం జాగ్రత్త వాహనం నడిపినా.. ఎదుటి వారు జాగ్రత్తగా నడపకపోతే.. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి-మజీదుపూర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదాన్ని వెనకాలే వస్తున్న వాహనంలోని వారు రికార్డు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ ఇన్నావో వాహనం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. డివైడర్ అవతలి వైవు ఓ ఫార్మసీ కంపెనీకి చెందిన బస్సు, ఆర్టీసీ బస్సు వస్తున్నాయి. ఆ వెనకలే మరో కారు వస్తుంది. అయితే తుర్కపల్లి, మజీదుపూర్ వద్ద ఇన్నావో వాహనం మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీకొట్టింది. అవతలి వైపు పల్టీలు కొట్టిన ఫార్మసీ బస్సు, ఆర్టీసీ బస్సును తాకి రోడ్డు ప్రక్కకు వెళ్లింది.

ఆర్టీసీ బస్సు వెనకాలే వస్తున్న కారులోని ఈ వీడియో తీశారు. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఒకరు హకీంపేట్ కు చెందిన శేఖర్ మోహన్ వాలే కాగా.. మరొకరు మౌలాలి ప్రాంతానికి చెందిన మలావత్ దీపిక గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మోహన్ కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు.
రాజీవ్ రహదారిపై తుర్కపల్లి, మజీద్ పూర్ మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనం డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపు పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. #roadaccident #Hyderabad pic.twitter.com/jhXfnNYpMZ
— Sardak One (@srinugo77283) July 28, 2024












Click it and Unblock the Notifications