దారుణం: బాత్రూంలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి బాలికపై రేప్
హైదరాబాద్: నగరంలోని బోరబండ ప్రాంతంలో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పిన దుండగుడు.. ఇంట్లోకి తీసుకెళ్లి.. కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాధిత బాలిక బంధువుల ఆందోళనతో తీవ్ర ఆ ప్రాంతం కొంత ఉద్రిక్తంగా మారింది.
స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతంలోని ఓ బస్తీకి చెందిన బాలిక(9) స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. రోజూ ట్యూషన్‌కు వెళ్లే బాలికను గమనించిన ఓ గుర్తుతెలియని యువకుడు.. ఆమె కోసం సోమవారం సాయంత్రం బస్తీలోని ఓ కిరాణ దుకాణం వద్ద మాటు వేశాడు.

బాలిక బయటకు రాగానే ఆమెకు మాయమాటలు చెప్పి.. బస్తీలోని ఓ ఇంట్లోని బాత్‌రూంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో కత్తి చూపి చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడు.
అనంతరం ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన సంఘటనను కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు బోరబండ పోలీసు ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేశారు. బాధిత బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలింపు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications