లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. రూ.6 వేలు లోన్ తీసుకున్నందుకు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి..
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. లోన్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రజలకు డబ్బు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నాయి. అప్పులు ఇస్తున్నాయి. ఇష్టమైనంత వడ్డీ వసూలు చేస్తున్నాయి. ప్రశ్నస్తే వేధింపులకు దిగుతున్నాయి. దీంతో బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్స్ వేధింపులు పెరిగిపోయాయి.

రూ.20 వేల లోన్..
ఏపీ, తెలంగామలో గత రెండు వారాల్లో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు వారాల క్రితం ఏపీలోని గుంటూరు జిల్లా గళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష అనే వివాహిత లోన్ యాప్స్ వారి వేధింపులు బరించలేకు ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్స్‌ల్లో రూ.20,000 లోన్ తీసుకుంది.

రూ.2లక్షలు కట్టించుకున్నారు..
రుణాలు ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీ అంటే చెప్పే నిర్వాహకులు ప్రత్యూష దగ్గర రూ.20 వేల రుణానికి దాదాపు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. దాదాపు రూ. లక్ష 80 వేలు ఎక్కువ కట్టించుకున్నా వారు ఇంకా డబ్బులు కట్టాలని బెదిరించారు. లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. బంధువులకు ఫోన్ చేసి పరువు తీస్తామని ఆందోళనకు గురి చేశారు. దీంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో లోన్ యాప్స్ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగే బలైపోయాడు.

రుణం చెల్లించినా..
జల్‌పల్లికి చెందిన యంజాల సుధాకర్.. ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. అతను గోల్డెన్ రూపీ అనే రుణయాప్ నుంచి 6వేల రుణం తీసుకున్నాడు. లోన్ సకాలంలో చెల్లించలేకపోయాడు. యాప్ ఏజెంట్ల వేధింపులు గురి చేయడంతో వెంటనే రుణం చెల్లించాడు. అయినా ఇంకా చెల్లించాలని వారు వేధించడం మొదలు పెట్టారు.

మోసగాడు అంటూ మెసేజ్‌లు..
డబ్బు చెల్లించకుంటే నీ భార్య ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే రోజుకు వెయ్యి వస్తాయంటూ వేధించడం మొదలు పెట్టారు. అంతేకాదు సుధాకర్ ఓ మోసగాడు అంటూ అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న పలువురికి మెసేజ్‌లు పెట్టారు. తో మనస్తాపం చెందిన సుధాకర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications