ఖరగ్‌పూర్ ఐఐటీలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య
కోల్‌కతా/హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుకుంటున్న హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నదిలో దూకి చందన్ సుమన్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఇద్దరు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లు మృతిచెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పెద్దగూడెం వద్ద మహిళ దారుణహత్య
మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి మండలం పెద్దగూడెం వద్ద ఓ మహిళ దారుణహత్యకు గురైంది. మృతురాలు గద్వాల మండలం గుడిపల్లికి చెందిన సత్తెమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications