ఆర్మూరు- నిర్మల్- ఆదిలాబాద్ రైల్వే లైన్ పై కీలక అప్డేట్, 7లక్షల మందికి లబ్ది!
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి సారించి పని చేస్తుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కొత్త రైల్వే లైన్లను, కొత్త రైల్వే ప్రాజెక్టులను ఇచ్చి పురోభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ఎన్నేళ్లగానో ఎదురుచూస్తున్న ఆర్మూరు నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టు పైన రైల్వే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
రైల్వే బోర్డు వద్ద డీపీఆర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు ఈ ప్రతిపాదిత రైల్వే మార్గం డిపిఆర్ ను రైల్వేబోర్డు ఆమోదిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దశ, దిశా లభిస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా రైల్వే కనెక్టివిటీ పరంగా ప్రస్తుతం వెనుకబడి ఉంది. ఈ కొత్త రైల్వేలైన్ వల్ల ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆర్మూర్ వంటి ప్రాంతాలకు నేరుగా రైలుసౌకర్యం కలుగుతుంది.

ఈ రైల్వే లైన్ తో బోలెడు ప్రయోజనాలు
దీంతో ఈ ప్రాంతానికి ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. స్థానిక ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ రైల్వే ప్రాజెక్టు ద్వారా రైతులకు కూడా మేలు జరుగుతుంది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పసుపు వంటి పంటలను తక్కువ ఖర్చుతో ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. అటవీ ఉత్పత్తులు, ఖనిజ వనరుల రవాణా సైతం ఈ ప్రాంతాలవారికి సులభతరమవుతుంది.
*ONE STEP CLOSER TO APPROVAL OF THE ARMOOR-ADILABAD RAILWAY LINE*
— Godam Nagesh (@nageshgodam) December 12, 2025
Adilabad MP Shri Godam Nagesh met Union Minister for Railways Shri @AshwiniVaishnaw ji today in New Delhi to review the progress of the Detailed Project Report (DPR) for the Armoor–Adilabad railway line. He… pic.twitter.com/DVueUQ7qH5
సుమారు 7లక్షల మంది జనాభాకు లబ్ది
ఈ ప్రతిపాదిత రైల్వే లైన్ డి పి ఆర్ పూర్తికాగా రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. దీనివల్ల ఆర్మూరు, నిర్మల్, ఉట్నూర్, ఆదిలాబాద్ ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. సుమారు 7లక్షల మంది జనాభాకు లబ్ది జరుగుతుంది. 4300 కోట్ల రూపాయలతో ఈ లైన్ ను నిర్మించాలని అంచనా వేస్తున్నారు. 136.50 కిలోమీటర్ల దూరం ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు చేయనున్నారు.
ఉత్తర తెలంగాణ చిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టు
ఈ నిర్మాణ పనులు మొదలైతే ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ రైల్వే లైన్ ఉత్తర తెలంగాణ చిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టుగా మారుతుంది అనేది నిస్సందేహం. త్వరితగతిని రైల్వే లైన్ ను మంజూరు చేయాలని, నిర్మాణ పనులు మొదలుపెట్టాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఒక్క అడుగు దూరంలో అప్రూవల్ ఉందని, త్వరగా అప్రూవల్ ఇవ్వాలని రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications