భూమి వ్యవహారంలో మానవత్వం చాటుకున్న లాయర్.!పేదలకు చెందాలని సీఎంకు లేఖ.!
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ గ్రామంలో 2400 ఎకరాలు భూమి పేదలకు చెందాలని ఓ లాయర్ గత కొన్ని సంవత్సరాలుగా న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. సర్వే నెం 7లో ఎకరా కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూమిని పేదలకు విడుదల చేయాలని హై కోర్ట్ లాయర్ షేక్ జిలానీ గత కొంత కాలంగా న్యాయంగా పోరాడుతున్నారు. భూమి పూర్వాపరాలు ఒకసారి సరిశీలిస్తే హనీఫా బీ 1947లో కేర్ టేకర్ కోసం ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచింది. ప్రభుత్వం 1954లో అటవీ శాఖకు 25 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది.
ఆ భూమి పేదలకు ఇవ్వాలని సీఎం కు లేఖ : లీజు కాలపరిమితి ఎప్పుడో 1979 సంవత్సరంలో ముగిసింది. 2014 సంవత్సరంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రంగారెడ్డి జిల్లా మెమో నం.కె3/762/2014, 22-03-2014 లో ఇదే భూమిక సంబందించిన సేత్వార్ మరియు వసూల్ బాకీ పత్రాలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని, అవే పత్రాలు తమ వద్ద ఉన్నాయని రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ మెమో జారీ చేశారు. పట్టా భూమి హనీఫా బీకి చెందిందని, మెమో ప్రకారం భూమి హనీఫా బీ కి చెందుతుందని ప్రభుత్వం కూడా అంగీకరించింది.

14 ఏళ్లుగా సొంత ఖర్చులతో న్యాయపోరాటం : బుదవారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు ధరకాస్తు ఇవ్వటం జరిగినదని హై కోర్ట్ లాయర్ షేక్ జిలానీ తెలిపారు. సుమారు 50 వేలమంది పేదలకు దానంగా ఇచ్చిన పట్టా భూమిని హైకోర్టు లో 14 సంత్సరాలుగా హైకోర్టు న్యాయవాది షేక్ జిలానీ కోర్టులో ప్రజల తరుపున వాదించటం జరిగిందని తెలుస్తోంది. గౌరవనీయులైన హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూమి ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి దీనిని సర్వే చేసి వారికి స్వాధీన పరచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

విజయం సాధించిన న్యాయవాది షేక్ జిలానీ : అంతే కాకుండా ఈ భూమిని రిజిస్టేషన్ చేసుకోవచ్చని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అందువలన బుదవారం అడ్వకేట్ షేక్ జిలానీ 50 వేలమంది తరుపున ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ ప్రధాకార్యదర్శికి కూడా వినతిప్రాన్ని ఇవ్వటం జరిగిందని, పేదల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం దీనిని సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని న్యాయవాది షేక్ జిలానీ స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications