60ఏళ్ల భార్యపై అనుమానం: గొంతుకోసి హత్య చేశాడు, ఆ తర్వాత తనూ
కాటికి కాళ్లు చాచిన వయస్సులో తన భార్యను అనుమానించి హత్య చేశాడో వృద్ధ ప్రబుద్ధుడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్: కాటికి కాళ్లు చాచిన వయస్సులో తన భార్యను అనుమానించి హత్య చేశాడో వృద్ధ ప్రబుద్ధుడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్‌బాగ్‌లో బుధవారం జరిగింది.

అనుమానంతోనే..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. యాదగిరిగుట్ట వానలమర్రి గ్రామానికి చెందిన బి.కిష్టయ్య(70), లక్ష్మి(60) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. కిష్టయ్య ఆనంద్‌బాగ్‌లోని జ్ఞానేశ్వర్ అపార్ట్‌మెంట్‌లో 15ఏళ్ల నుంచి వాచ్‌మన్‌గా ఉంటున్నాడు. లక్ష్మి తరచూ బయటికెళ్లి రాత్రి ఆలస్యంగా వస్తోందని, ఫోన్‌లో ఎవరెవరితోనో చాలాసేపు మాట్లాడుతోందన్న అనుమానంతో కిష్టయ్య రెండు మూడు నెలలుగా భార్యతో గొడవ పడుతున్నాడు.

గొంతుకోసి హత్య
అంతేగాక, నిత్యం తన భార్యను వేధించేవాడు కిష్టయ్య. ఎప్పుడో ఓసారి నిన్ను చంపి నేనూ చస్తానంటూ ఆమెను బెదిరించేవాడు. ఈ క్రమంలో లక్ష్మితో గొడవపడిన కిష్టయ్య.. ఆమెను కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.

ఫోన్ చేసి చెప్పాడు..
ఆ తర్వాత బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు దమ్మాయిగూడలో ఉంటున్న చిన్న కుమారుడు సంతోష్‌కు కిష్టయ్య ఫోన్‌చేసి.. మీ అమ్మ కరెంట్ షాక్‌తో చనిపోయిందని చెప్పాడు. సంతోష్ మల్కాజిగిరిలోనే మరోచోట ఉన్న తన అల్లుడు భాస్కర్‌కు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు.

గొంతుకోసి.. తనూ ఆత్మహత్య
దీంతో భాస్కర్.. కిష్టయ్య ఉండే అపార్ట్‌మెంట్ వద్దకెళ్లి చూడగా..అమ్మమ్మ లక్ష్మి రక్తపు మడుగులో ఉంది. టెర్రస్‌పై ఉన్న సెల్‌టవర్‌కు తాత కిష్టయ్య ఉరేసుకొని కనిపించాడు. చిన్న కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి ఎస్‌ఐ జేమ్స్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానంతోనే కిష్టయ్య ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications