హైదరాబాద్-ఖమ్మం: ఆలుమగలను కలిపేందుకు వెళితే చంపేశారు
ఖమ్మం: ఆలుమగల మధ్య గొడవ జరుగుతుంటే పోవద్దని ఇందుకే అంటారేమోనని ఈ ఘటన తీవ్రతను చూస్తే తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో ఓ దంపతులు గొడవపడుతుంటే.. వారిని వారించేందుకు వెళ్లిన మధ్య దారుణ హత్యకు గురయ్యాడు.
ఆలస్యంగా వెలుగు చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఇల్లందు 24వ ఏరియాకు చెందిన దంపతుల మధ్య కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో సదరు మహిళ హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలో ఆమె అద్దెకు ఉండే ఇంటి యజమాని ఆమె సమస్యను తెలుసుకున్నాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించాడు. ఈ నేపథ్యంలోనే వారం క్రితం అతడు ఇల్లందు వచ్చాడు.
కాగా, ఇక్కడ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో తలదూర్చిన అతడ్ని.. మహిళ భర్త హత్య చేశాడు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో పూడ్చిపెట్టాడు.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్‌లో ఉండే మృతుడి కుటుంబీకులు అతడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఇల్లందు చేరుకుని విచారణ చేపట్టారు. వారి దర్యాప్తులో అతడు హత్య గురయ్యాడని గుర్తించిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications